పాలరాతి బొమ్మే.. కలర్ ఫుల్ గౌన్ లో మిల్క్ బ్యూటీ గ్లామర్ విందు.. బ్యూటీఫుల్ లుక్

First Published | Oct 22, 2023, 3:08 PM IST

స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా వరుస చిత్రాలతో అలరిస్తోంది. అలాగే పలు ఈవెంట్లకూ హాజరవూ ఆకట్టుకుంటోంది. బ్యూటీఫుల్ లుక్స్ తో మిల్క్ బ్యూటీ మంత్రమగ్ధులను చేస్తోంది.
 

టాలీవుడ్ ను కొన్నేళ్ల పాటు ఊపూపింది మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia).  తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. తన అందం, నటన, డాన్స్ తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ నూ సంపాదించుకుంది. 
 

‘బాహుబలి’వంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ లో వర్క్ చేసి దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుంది. ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అలాగే తమిళం, హిందీలోనూ వరుసగా సినిమాలు చేసి సత్తాచాటింది. ప్రస్తుతం బాలీవుడ్ లో సందడి చేస్తోంది. 
 


సినిమాలతోనే కాకుండా వెబ్ సిరీస్ ల్లోనూ నటిస్తూ వస్తోంది. తన కెరీర్ లో ఇన్నాళ్లుగా ఉన్న రూల్స్ ను బ్రేక్ చేస్తూ షాకిస్తోంది. రీసెంట్ గా ‘జీ కర్దా’ అనే వెబ్ సిరీస్ లో నటించిన విషయం తెలిసిందే. ఇందులో ఏకంగా  బెడ్ సీన్ తో ఆశ్చర్యపరిచింది. తన పెర్ఫామెన్స్ తో మతులు పోగొట్టింది.
 

ఇక తాజాగా ‘జీ కర్దా’, ఆ తర్వాత వచ్చిన ‘ఆఖ్రీ సచ్’ వంటి సిరీస్ ల్లో తన పెర్ఫామెన్స్  కు గానూ బెస్ట్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకుంది. రియల్ బాలీవుడ్ హంగామా నుంచి ఈ అవార్డును అందుకుంది. ఈవెంట్ లో కలర్ ఫుల్ గౌన్ లో మెరిసి మైమరిపించింది.
 

రంగురంగుల గౌన్ లో తమన్నా భాటియా మంత్రముగ్ధులను చేసింది. అచ్చం పాలరాతి బొమ్మవలే మెరిసిపోయింది. అందంతో చూపుతిప్పుకోకుండా చేసింది. మరోవైపు స్లీవ్ లెస్, ఎద అందాలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. మత్తెక్కించే చూపులతో, నిషా కళ్లతో మెస్మరైజ్ చేసింది. 
 

తమన్నా తాజాగా పంచుకున్న పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ముద్దుగుమ్మకు పెర్ఫామెన్స్ కు అవార్డు దక్కడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక బ్యూటీఫుల్ లుక్ లో దర్శనమివ్వడంతో ఆమె అందాన్ని పొగుడతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. 
 

Latest Videos

click me!