Priyanka Chopra: అంతా తూచ్‌..ఒక్క పోస్ట్ తో `డైవర్స్` రూమర్లకి చెక్‌ పెట్టిన ప్రియాంక చోప్రా

First Published | Nov 23, 2021, 6:58 PM IST

గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా.. అభిమానులకు, నెటిషన్టకి షాకిచ్చింది. తన భర్త జోనాస్‌ పేరుని సోషల్‌ మీడియా అకౌంట్ల నుంచి తీసేసి దుమారం రేపింది. ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌ అయ్యింది. కానీ ఇప్పుడు మైండ్‌ బ్లాంక్‌ చేస్తుంది. 

ప్రియాంక చోప్రా(Priyanka Chopra) ఇప్పుడు గ్లోబల్‌ స్టార్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన ఆమె క్రమంగా హాలీవుడ్‌ ఆఫర్లు దక్కించుకుని తిరుగులేని స్టార్‌ అయిపోయింది. అంతర్జాతీయంగా పాపులారిటీని సొంతం చేసుకుంది. గతంలో చాలా మంది బాలీవుడ్‌ భామలు హాలీవుడ్‌లో సినిమాలు చేశారు. కానీ ప్రియాంక మాదిరిగా అక్కడే సెటిల్‌ కాలేదు. ఒకటి రెండు అక్కడ చేసి వచ్చారు. ఇప్పుడు ప్రియాంక మాత్రం హాలీవుడ్‌లోనే సెటిల్‌ అయిపోయింది. 

Priyanka Chopra మూడేళ్ల క్రితం హాలీవుడ్‌ పాపులర్‌, పాప్‌ సింగర్ నిక్‌ జోనాస్‌(Nick Jonas)ని  ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇండియన్‌ కల్చర్‌ ప్రకారం జోద్‌పూర్‌ ప్యాలెస్‌లో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ప్రియాంకకి ప్రయారిటీ ఇచ్చి హిందూ సాంప్రదాయాల ప్రకారం తన పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవడం Nick Jonas గొప్పతనమని చెప్పొచ్చు. అంతేకాదు తన ప్రియురాలికి ఇచ్చిన ప్రయారిటీగా చెప్పొచ్చు. 


వీరిద్దరు భార్యా భర్తలైనా కెరీర్‌ పరంగా ఎవరిదారుల్లో వారున్నారు. నటిగా ప్రియాంక దూసుకుపోతుంది. పాప్‌ సింగర్‌గా నిక్‌ జోరుమీదున్నాడు. అయితే అమెరికాలో ప్రియాంక ఆ మధ్య ఓ రెస్టారెంట్‌ని కూడా ప్రారంభించింది. అక్కడ ఇండియన్‌ వంటకాలను అమెరికన్లకి అందిస్తుంది. అంతేకాదు ఇటీవల దీపావళి సందర్భంగా లాస్‌ ఏంజెల్స్ లో కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం చేశారు. ఆ సందర్భంగా పిక్‌ని కూడా పంచుకుని మహాలక్ష్మీ దేవత ఆశీస్సులతో తాను కొత్త ఇంట్లోకి అడుగుపెడుతున్నట్టు తెలిపింది ప్రియాంక. 

అంతా బాగానే ఉన్నా సోమవారం ప్రియాంక, నిక్‌ లకు సంబంధించి ఓ వార్త సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యింది. ప్రియాంక తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ నుంచి తనపేరులోని `జోనాస్‌` సర్‌నేమ్‌ని తొలగించింది. భర్త పేరుని తొలగించడం పెద్ద దుమారం రేగింది. అటు హాలీవుడ్‌లో, ఇటు ఇండియాలోనూ ఈ వార్తలు వైరల్‌ అయ్యింది. సంచలనం సృష్టిస్తుంది. జోనాస్‌ పేరుని తొలగించడంతో వీరిద్దరు విడిపోతున్నారా? అనే వార్తలు ఊపందుకున్నాయి. మ్యారేజ్‌ చేసుకున్న మూడేళ్లకే విడిపోవడమేంటంటూ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. నాగచైతన్య, సమంత ల మధ్య జరిగిందే.. ప్రియాంక విషయంలో జరుగుతుందా? అనే పుకార్లు ఊపందుకున్నాయి. 

దీనిపై ప్రియాంక తల్లి మధు చోప్రా స్పందించింది. ఈ వార్తలను ఖండించింది. తప్పుడు వార్తలను, పుకార్లు వ్యాప్తి చేయోద్దని వెల్లడించింది. మరోవైపు బాలీవుడ్‌ నటుడు, క్రిటిక్‌ కమల్‌ ఆర్‌ ఖాన్‌ సైతం సెటైరికల్‌గా ట్వీట్‌ చేశారు. తాను మూడేళ్ల క్రితమే ఈ విషయం చెప్పానని, ఇప్పుడు ఆ టైమ్‌ వచ్చిందని, ప్రియాంక-నిక్‌ విడిపోతున్నారనేది నిజం కాబోతుంది. చిల్‌ అవ్వండి` అంటూ పోస్ట్ చేశారు. 

దీంతో ప్రియాంక, నిక్‌ల మధ్య ఏం జరిగింది. ఎందుకు వీరిద్దరు విడిపోవాలనుకుంటున్నారు. ప్రియాంక తన అకౌంట్ నుంచి జోనాస్‌ పేరుని ఎందుకు తొలగించినట్టు అంటూ ఆవేదన చెందుతున్నారు. నిజంగానే వీళ్లిద్దరు విడిపోతున్నారా? అనే కామెంట్లు మరింత వైరల్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రియాంక ఒక్క పోస్ట్ తో ట్రోల్స్ లకు పుల్‌స్టాప్‌ పెట్టింది. అందరి నోళ్లు మూయించింది. 

అయితే ప్రియాంక తాము విడిపోతున్నట్టు వచ్చిన వార్తలపై స్పందించలేదు. కానీ ఆ వార్తలకు మాత్రం చెక్‌ పెట్టింది. నిక్‌ జోనాస్‌ ఈ రోజు ఓ వీడియో పంచుకున్నారు. జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ తీసిన వీడియో పోస్ట్ పెట్టాడు. మోటివేషన్‌ అంటూ పేర్కొన్నాడు. దీనికి స్పందించింది ప్రియాంక. భర్త కండలు తిరిగిన దేహాన్ని ఉద్దేశిస్తూ నీ చేతుల్లో చచ్చిపోతాను అంటూ ఫన్నీగా, ప్రేమగా పోస్ట్ పెట్టింది. దీంతో విడాకులు రూమర్స్ కి చెక్ పట్టినట్టయ్యింది. ఇది చూసిన నెటిజన్లు సెటైరికల్‌గా స్పందిస్తున్నారు. `అంతా తూచ్‌` అంటూ కామెంట్లు పెడుతున్నారు. నెటిజన్లని వెర్రిపుష్పాలను చేసిందంటూ కామెంట్‌ చేయడం విశేషం. 

ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లో నటిస్తున్న `మ్యాట్రిక్స్` మూవీ ఫస్ట్ లుక్‌ విడుదలైంది. ప్రియాంక చోప్రా లుక్ విడుదల చేయగా, అది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది. దీంతోపాటు  `టెక్ట్స్ ఫర్‌ యూ` చిత్రంలో నటిస్తుంది. అలాగే `సిటాడెల్‌` అనే టీవీ షో చేస్తుంది ప్రియాంక.

also read: Priyanka Chopra: ఇన్‌స్టాలో భర్త `జోనాస్‌` పేరు తీసేసిన ప్రియాంక.. షాక్‌లో ఫ్యాన్స్.. నెక్ట్స్ డైవర్సేనా?

Latest Videos

click me!