Naga Chaitanya Birthday: నాగ చైతన్య ఫ్యాన్స్ ఆయన నటించిన ఈ చిత్రాలు అస్సలు మిస్సవద్దు!

First Published Nov 23, 2021, 4:01 PM IST

అందంలో అభినయంలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు నాగ చైతన్య (Naga Chaitanya). పదేళ్ల కెరీర్ లో భిన్నమైన జోనర్స్ ట్రై చేసిన నాగ చైతన్య యూత్ ఆడియన్స్ లో లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నారు. నేడు తన 35వ బర్త్ డే జరుపుకుంటున్న చైతన్య కెరీర్ లో బెస్ట్ మూవీస్ ఏమిటో చూద్దాం... 
 

23ఏళ్ల ప్రాయంలో వెండితెరకు పరిచయమైన నాగ చైతన్య మొదటి చిత్రం జోష్ (Josh). నాగార్జున కొడుకు లాంఛింగ్ భారీగా ప్లాన్ చేశారు. యాక్షన్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ని ఎంచుకున్నారు. 2009లో విడుదలైన జోష్ నాగ చైతన్య మొదటి చిత్రం. స్టూడెంట్స్ పాలిటిక్స్ ప్రధానంగా తెరకెక్కిన జోష్ అనుకున్నంతగా విజయం సాధించలేదు. అయితే నాగ చైతన్య నటుడిగా మొదటి చిత్రంతోనే నిరూపించుకున్నాడు. 
 


2010లో నాగ చైతన్య-సమంత  కాంబినేషన్ లో వచ్చిన ఏమాయ చేశావే (em maya chesave)సూపర్ హిట్ అందుకుంది. నాగ చైతన్య కెరీర్ లో రెండవ చిత్రంగా వచ్చిన ఏమాయ చేశావే ఆయన కెరీర్ లో ఫస్ట్ హిట్ గా నమోదైంది. దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ యూత్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది

మూడో చిత్రంతో మరో హిట్ కొట్టాడు నాగ చైతన్య.  దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ 100% లవ్. నాగ చైతన్యకు తమన్నా జోడిగా నటించిగా, భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ మూవీతో నాగ చైతన్య లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. యూత్ లో ఆయన పాపులారిటీ పెరిగింది. 

అక్కినేని కుటుంబానికి ప్రత్యేక చిత్రంగా నిలిచింది మనం (Manam). నాగేశ్వరరావు నుండి అఖిల్ వరకు మూడు తరాల నటులు ఈ మూవీలో నటించగా... నాగేశ్వరరావుకి చివరి చిత్రం. అద్భుతమైన స్క్రీన్ ప్లే తో తెరకెక్కిన మనం మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. రెండు భిన్నమైన రోల్స్ లో చైతు అద్భుతంగా నటించారు. 

మలయాళ హిట్ మూవీ ప్రేమమ్ కి రీమేక్ గా తెరకెక్కిన ప్రేమమ్ చైతూ కెరీర్లో బెస్ట్ మూవీ అని చెప్పాలి. వరుస ప్లాప్స్ ఎదుర్కొంటున్న నాగ చైతన్యను హిట్ ట్రాక్ ఎక్కించింది ప్రేమమ్. ప్రేమమ్ మూవీలో చైతూకి జంటగా శృతి హాసన్, అనుపమ పరమేశ్వరన్ నటించారు. 

నాగ చైతన్య కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలిచిపోతుంది మజిలీ (Majili). ఈ మూవీలో నాగ చైతన్య కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. సమంత చైతూతో మరోమారు జతకట్టగా.. ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. లవ్ కోసం క్రికెట్ కెరీర్ ని వదిలేసిన భగ్నప్రేమికుడిగా చైతన్య అద్భుత నటన కనబరిచాడు. 


మిడిల్ క్లాస్ అబ్బాయిగా లవ్ స్టోరీ (Love story)మూవీలో సహజ నటనతో కట్టిపడేశాడు నాగ చైతన్య. దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రేమికుల మధ్య కులం అడ్డుగోడలు, ఆడవాళ్లపై లైంగిక వేధింపులు వంటి టాపిక్స్ టచ్ చేస్తూ ఎంతెర్తైనింగ్ తెరకెక్కించారు. నాగ చైతన్య కెరీర్ బెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది లవ్ స్టోరీ. ఈ చిత్రాలు నాగ చైతన్య కెరీర్ లో ప్రత్యేక స్థానం కలిగి ఉన్నాయి. 

Also read Naga chaitanya birthday: అఖిల్ కాకుండా నాగ చైతన్యకు మరో తమ్ముడు ఉన్నాడు తెలుసా!

Also read Bangarraju Teaser: చిన బంగార్రాజు వచ్చేశాడు.. నాగ చైతన్య స్టైల్ టెర్రిఫిక్ అంతే..

click me!