అంతే కాదు దీపికా (Deepika Padukone) తమ వయసుల ప్రస్తావన కూడా తీసుకు వచ్చింది. నా వయసు 36, అనన్య వయసు 23. అనన్య (Ananya Panday) నా చెల్లి కన్నా చిన్నది. తనతో కలిసి నటించడం నిజంగా చక్కటి అనభూతిని ఇచ్చింది. అనన్య అందరి అమ్మాయిల్లా.. అందరు యాక్ట్రస్ ల్లా కాదు..ఆమె చాలా తెలివైన అమ్మాయి అంటూ కితాబిచ్చింది దీపికా(Deepika Padukone). అంతే కాదు... సెట్‌లో ఇతర నటులు ఎలా నటిస్తున్నారనేది బాగా గమనిస్తుంది.. వాళ్ల నుంచి కొత్త విషయాలు వదిలిపెట్టుకుండా నేర్చుకుంటుంది అంటూ.. అనన్యను ఆకాశానికెత్తేసింది దీపికా.