కెరీర్, పర్సనల్ లైఫ్ విషయంలో ప్రియమణి ప్లానింగ్ తో వ్యవహరించింది. చకచకా సినిమాలు చేసేసింది. విజయవంతమైన చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న సమయంలో వివాహం చేసేసుకుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా టివి రంగంలోకి అడుగు పెట్టింది. ఇలా ఎప్పటికప్పుడు ప్లానింగ్ చేసుకుంటూ ప్రియమణి ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ప్రియమణి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది.