తన వ్యక్తిగత జీవితంలో జరిగిన మానసిక వేదన నుంచి Samantha ఇప్పుడిప్పుడే బయట పడుతోంది. తన స్నేహితులతో కలసి తీర్థయాత్రలకు, వెకేషన్స్ కి వెళుతోంది. అలాగే కొత్త ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెడుతోంది. ఇక సమంత సేవా కార్యక్రమాలు, గొప్పమనసు గురించి చాలా మందికి తెలుసు. ప్రత్యూష పౌండేషన్ ప్రారంభించిన సమంత ఎందరో చిన్న పిల్లలకు ఉచితంగా వైద్యం అందిస్తోంది.