Karthika Deepam: శ్రావ్యలో మార్పు.. మళ్లీ డాక్టర్ బాబుకు జైలు శిక్ష.. ఈసారి అతడి మరణంతో?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 03, 2021, 09:25 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం ( Karthika Deepam) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో దూసుకెళుతోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.  

PREV
110
Karthika Deepam: శ్రావ్యలో మార్పు.. మళ్లీ డాక్టర్ బాబుకు జైలు శిక్ష.. ఈసారి అతడి మరణంతో?

సౌందర్య (Soundarya) దీపతో (Deepa) గత విషయాల గురించి మాట్లాడుతూ బాగా ఎమోషనల్ అవుతుంది. ఏ రోజు కూడా వాటిని సరిగా పట్టించుకోలేదు అంటూ  ఎప్పుడు నీ గురించే ఆలోచించాను అంటూ బాగా ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది.
 

210

ఇక దీప.. మోనిత (Monitha) గురించి ఆలోచించకండి అంటూ తన పని చూసుకుంటాను అని ధైర్యం ఇస్తుంది. ఇక సౌందర్య గతంలో తన చేతులారా చేయించిన దోష నివారణ పూజ, కార్తీక్ (Karthik) సైన్ గురించి చెబుతూ నన్ను క్షమించవే అంటూ బాధపడుతుంది. ఇక దీప ఓదార్చుతుంది.
 

310

మరోవైపు మోనిత (Monitha) ఇంట్లో ప్రియమణి కోపంతో సామాన్లు  అన్ని అక్కడ అక్కడ పడేస్తుంది. వెంటనే మోనిత వచ్చి ఏం జరిగింది అంటూ ప్రశ్నించగా ప్రియమణి (Priyamani) వెంటనే కోపంతో రగిలిపోతూ చీము, రోషం, పౌరుషం ఉందా అంటూ అంత గొడవలు జరిగినా అసలు పట్టించుకోకుండా ఉన్నామంటూ మోనిత పై అరుస్తుంది.
 

410

మీ ఉప్పు తింటున్నందుకు నాకు ఇంత కోపం వస్తుంటే.. మీరు ఎందుకు ఏం పట్టనట్టు ఇలా ఉన్నారు అంటూ మోనితను (Monitha) ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తోంది. ఇక మోనిత ఏం పట్టనట్లు లేను అంటూ దీప పని చేస్తాను అని అనడంతో ప్రియమణి (Priyamani) పెదాలపై చిరునవ్వు వస్తుంది.
 

510

ఇక హాస్పిటల్లో కార్తీక్ (Karthik) దగ్గరికి ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను తీసుకొని వచ్చి తన భర్త ఆరోగ్యం బాగా లేదని తమ పరిస్థితులు బాగాలేవని ఎలాగైనా కాపాడమని వేడుకుంటుంది. వెంటనే కార్తీక్ తనకు తన భర్తను కాపాడతానని ధైర్యం ఇస్తాడు.
 

610

సౌందర్య (Soundarya) కార్తీక్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఏమైనా జరిగిందేమో అని టెన్షన్ పడుతుంది. అప్పుడే శ్రావ్య వచ్చి దీపు (Deepu) గురించి చెబుతుంటే సౌందర్య పట్టించుకోకుండా కార్తీక్ కోసం చూస్తుంది. గుడ్ న్యూస్ అని చెప్పినా కూడా సౌందర్య అసలు వినదు.
 

710

ఇక శ్రావ్య (Sravya) పదేపదే అడగటంతో కార్తీక్ (Karthik) కోసం ఎదురు చూస్తున్నాను అని అనడంతో వెంటనే శ్రావ్య తన మనసులో.. ఎప్పుడు పెద్ద కోడలు, పెద్ద కొడుకు గురించి పట్టించుకుంటారు.. మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటారులే అని అనుకుంటుంది.
 

810

ఆ గుడ్ న్యూస్ ఏంటో చెప్పు అని సౌందర్య (Soundarya) అనటంతో వద్దులే అంటూ మీరు వినేలా లేరని అనటంతో ఏం కాదు చెప్పు అని అంటుంది. శ్రావ్య గుడ్ న్యూస్ చెప్పిన సౌందర్య పట్టించుకోదు. శ్రావ్య (Sravya) బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
 

910

కార్తీక్ (Karthik) ఆపరేషన్ థియేటర్లో వణుకుతూ ఆపరేషన్ చేస్తుంటాడు. అప్పటికి రవి (Ravi) ఎలా ఉందని అడుగుతున్న కూడా ఆపరేషన్ చేస్తూ ఉంటాడు.  మరోవైపు పేషెంట్  భార్య పిల్లలు అతని ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటారు.
 

1010

కార్తీక్ (Karthik) మాత్రం మొత్తం స్పృహ లేకుండా ఆపరేషన్ చేసేస్తాడు. రవి చెప్పినా వినకుండా అలాగే చేస్తుంటాడు. కానీ ఆ పేషెంట్ అప్పటికే చనిపోవడంతో.. రవి (Ravi) కోపంతో కార్తీక్ అతడిని చంపేసావని అనేసరికి కార్తీక్ షాక్ అవుతాడు. మళ్లీ కార్తీక్ కు జైలు శిక్ష తప్పేలా లేదు.

click me!

Recommended Stories