Marakkar movie review: మరక్కార్ మూవీ ప్రీమియర్స్ రివ్యూ

First Published Dec 3, 2021, 9:03 AM IST

బాహుబలి మూవీ విజయం తర్వాత దేశంలో భారీ చిత్రాల ట్రెండ్ మొదలైంది. తమిళ్, మలయాళ, కన్నడ, హిందీతో పాటు ప్రధాన పరిశ్రమలకి చెందిన దర్శక నిర్మాతలు తమ నేటివిటీ, మూలాలకు సంబంధించిన చరిత్రను వెలికితీసి పీరియాడిక్ కథలు తెరకెకెక్కిస్తున్నారు.
 

 అదే తరహా తెరకెక్కింది మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohan lal) నటించిన మరక్కార్. నేడు ఈ మూవీ విడుదల కాగా.. ప్రీమియర్స్ టాక్ ఎలా ఉందో చూద్దాం మరక్కార్ (Marakkar) మూవీ 16వ శతాబ్దానికి చెందిన కథ. సముద్ర మార్గంలో కేరళ చేరుకున్న పోర్చుగీసువారు వ్యాపారం పేరుతో స్థానిక రాజ్యాలపై ఎలా పెత్తనం సాగించారు. పోర్చుగీసువారి ఆధిపత్యానికి ఎదిరించి కుంజాలి మరక్కార్ ఎలా నిలబడ్డాడు అనేది ప్రధాన కథ. పోర్చుగీసు వారి చేతిలో కుంజాలి మరక్కార్(మోహన్ లాల్) ఫ్యామిలీ దారుణంగా చంపబడుతుంది. ఆ దాడి నుండి తప్పించుకున్న మరక్కార్ అడవిలోకి పారిపోతాడు. దొంగగా మారిన మరక్కార్ పెద్దలను దోచి పేదలకు పెడుతూ ఉంటారు. మరి తన కుటుంబాన్ని నాశనం చేసిన పోర్చుగీసు వారిపై కుంజాలి మరక్కార్ ఎలా పగ తీర్చుకున్నాడు అనేది మరక్కారు మూవీ కథ .

భారీ క్యాస్ట్ తో దర్శకుడు ప్రియదర్శన్ హిస్టారిక్ పీరియడ్ యాక్షన్ ఎంటర్టైనర్ మరక్కార్ అనేక పీరియాడిక్ చిత్రాల నుండి స్ఫూర్తి పొందిన చిత్రంగా అనిపిస్తుంది. ఉరిమి, బాహుబలి వంటి చిత్రాల ఛాయలు మరక్కార్ మూవీలో చూడవచ్చు. యుద్ధ సన్నివేశాలలో బాహుబలి మూవీ స్ఫూర్తి స్పష్టంగా కనిపిస్తుంది. 

మరక్కార్ మూవీలోని లెక్కకు మించిన పాత్రలు ఒకింత తికమక పెడతాయి. ఒక పాత్ర గురించి అర్థం చేసుకునే లోపు మరో కొత్త పాత్ర వచ్చి చేరుతుంది. కథలో కీలకమైన చాలా పాత్రల నేపథ్యం ఏమిటో అర్థం కాకుండానే కథ ముగుస్తుంది. ముఖ్యంగా కీలకమైన లేడీ క్యారెక్టర్స్ చేసిన సుహాసిని, మంజు వారియర్, కీర్తి సురేష్ ఇంపాక్ట్ చూపించలేకపోయారు. 

సినిమా ఎమోషనల్ గా ప్రేక్షకులకు కనెక్ట్ కావడంతో ఫెయిల్ అయ్యింది. బలహీనమైన స్క్రీన్ ప్లే ఎటువంటి ఉత్కంఠ కలిగించలేకపోయింది. క్లైమాక్స్ తో పాటు సెకండ్ హాఫ్ లో సన్నివేశాలు ప్రేక్షకులకు ముందుగానే అర్థం అవుతూ ఉంటాయి. మొదటి హాఫ్ మొత్తం పాత్రలను పరిచయం చేయడానికే దర్శకుడికి సమయం సరిపోయింది. 

ఇక 16వ శతాబ్దం నాటి పరిస్థితులు, భాష, సంస్కృతిపై కూడా మరక్కార్ టీమ్ కసరత్తులు చేయలేదేమో అనిపిస్తుంది. ఓ ముస్లిం ఫ్యామిలీ, బ్రాహ్మణ ఫ్యామిలీ లాంగ్వేజ్, యాక్సెంట్ ఒకేలా ఉండడం విడ్డూరం. ఇక చాలా సన్నివేశాలలో దర్శకుడు లాజిక్ ఫాలో కాలేదు. సదరు సన్నివేశాలు కొంచెం సిల్లీగా తోస్తాయి.

మోహన్ లాల్ యాక్టింగ్, హీరోయిజం... నిర్మాణ విలువలు ఆకట్టుకుంటాయి. యాక్షన్ సన్నివేశాల్లో విజువల్స్ మూవీలో ఆకట్టుకునే అంశాలు. ఈ మూవీలో చెప్పుకోదగ్గ పాజిటివ్ అంశాలు ఉన్నప్పటికి... వీక్ స్క్రీన్ ప్లే తో మంచి కథను నిరాశాజనకంగా ముగించారని చెప్పుకోవచ్చు. 


అర్జున్, సునీల్ శెట్టి, సుహాసిని, మంజు వారియర్, ప్రభు వంటి స్టార్స్ ని సరిగా ఉపయోగించుకోలేకపోయారు. 
మోహన్ లాల్ కెరీర్ లో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కి పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులు ఊహించిన స్థాయిలో లేదు. అయితే మరీ భారీ అంచనాలు పెట్టుకోకుండా వెళితే మూవీ మంచి అనుభూతిని పంచె ఆస్కారం కలదు. 

Also read Mohanlal:‘మరక్కార్’తెలుగు ట్రైలర్

click me!