నాకు వాటాలు వద్దు, కచ్చితంగా రెమ్యునరేషన్ పెంచుతా.. ప్రియదర్శి కామెంట్స్
యంగ్ హీరో ప్రియదర్శి నటించిన సారంగపాణి జాతకం చిత్రం ఏప్రిల్ 25న రిలీజ్ అవుతోంది. కోర్ట్ మూవీ సంచలన విజయం సాధించడంతో ప్రియదర్శి సినిమాలపై ఆడియన్స్ లో ఆసక్తి పెరుగుతోంది.
యంగ్ హీరో ప్రియదర్శి నటించిన సారంగపాణి జాతకం చిత్రం ఏప్రిల్ 25న రిలీజ్ అవుతోంది. కోర్ట్ మూవీ సంచలన విజయం సాధించడంతో ప్రియదర్శి సినిమాలపై ఆడియన్స్ లో ఆసక్తి పెరుగుతోంది.
యంగ్ హీరో ప్రియదర్శి నటించిన సారంగపాణి జాతకం చిత్రం ఏప్రిల్ 25న రిలీజ్ అవుతోంది. కోర్ట్ మూవీ సంచలన విజయం సాధించడంతో ప్రియదర్శి సినిమాలపై ఆడియన్స్ లో ఆసక్తి పెరుగుతోంది. టాలీవుడ్ లోకి ప్రియదర్శి కమెడియన్ గా అడుగు పెట్టినప్పటికీ.. మల్లేశం, బలగం, కోర్ట్ లాంటి చిత్రాలతో హీరోగా తనదైన ముద్ర వేశారు.
క్రమంగా ప్రియదర్శి సినిమాలకు మార్కెట్ పెరుగుతోంది. ప్రియదర్శి కథల ఎంపిక అద్భుతంగా ఉంది అంటూ టాలీవుడ్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన సారంగపాణి జాతకం చిత్రం ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో ప్రియదర్శి తన రెమ్యునరేషన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం సినిమా బిజినెస్ ఓటీటీ, శాటిలైట్, థియేటర్ ఇలా చాలా రకాలుగా సాగుతోంది. దీనితో హీరోలు కూడా కొన్ని ఏరియాల రైట్స్ తీసుకోవడం లేదా లాభాల్లో వాటా తీసుకోవడం చేస్తున్నారు. మీరు కూడా లాభాల్లో వాటా తీసుకుంటున్నారా అని ప్రశ్నించగా.. ప్రియదర్శి లేదని సమాధానం ఇచ్చారు.
నేను కేవలం రెమ్యునరేషన్ మాత్రమే తీసుకుంటున్నా. ఓవర్సీస్ రైట్స్ ఇవ్వండి, మరో ఏరియా రైట్స్ ఇవ్వండి అని నేను ఇంతవరకు నిర్మాతలని అడగలేదు అని ప్రియదర్శి తెలిపారు. కానీ తప్పకుండా తన రెమ్యునరేషన్ ని మాత్రం పెంచుతానని తెలిపాడు.
ఎందుకంటే నాకు అవకాశాలు లేనప్పుడు నేను ఖాళీగా కూర్చున్నాను కదా అని సరదాగా తెలిపాడు. నేను అడగాల్సిన దానికన్నా ఎక్కువ రెమ్యునరేషన్ అడిగితే నిర్మాతలు ఇవ్వరు కూడా అని ప్రియదర్శి తెలిపారు.