నేను కమెడియన్ అవుదాం అని ఇండస్ట్రీకి రాలేదు. ఎందుకంటే సత్య, వెన్నెల కిషోర్ తరహాలో నేను కామెడీ పండించలేను. అందుకే కోట శ్రీనివాసరావు, ప్రకాష్ రాజ్ లాంటి నటుడిని కావాలని కలలు కనేవాడిని. నాకు నాకు వచ్చిన పాత్రలని అంగీకరించి కొన్ని సినిమాలు చేశా. ఆ క్రమంలో కామెడీ రోల్స్ కూడా చేశాను అని ప్రియదర్శి తెలిపారు.