సోహైల్‌-అరియానాలను మించిపోతున్న సన్నీ-ప్రియాల ఫైటింగ్‌.. చెంప పగలగొడతానంటూ వార్నింగ్‌..

Published : Oct 20, 2021, 09:11 AM IST

బిగ్‌బాస్‌5 షో ఎంటర్‌టైన్‌మెంట్‌ని రెట్టింపు చేస్తుంది. బిగ్‌బాస్‌4లో చివర్లో సోహైల్‌, అరియానాల మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. కానీ ఇప్పుడు బిగ్‌బాస్‌5లో మాత్రం సన్నీ- ప్రియాల మధ్య వచ్చే సన్నివేశాలు దాన్ని మించిపోతున్నాయి. ఫిజికల్‌ దాడులకు దారితీస్తున్నాయి. రచ్చ రచ్చ చేస్తున్నాయి.   

PREV
17
సోహైల్‌-అరియానాలను మించిపోతున్న సన్నీ-ప్రియాల ఫైటింగ్‌.. చెంప పగలగొడతానంటూ వార్నింగ్‌..

బిగ్‌బాస్‌4లో మొదట్నుంచి సైలెంట్‌గా ఉన్న సోహైల్‌, అరియానా ఏడెనిమిది వారాల తర్వాత నెమ్మదిగా విజృంభించారు. తమ సత్తాని చాటారు. ఇక చివరి ఐదు వారాల్లో వీళ్లే హైలైట్‌గా నిలిచారు. అఖిల్‌, మోనల్‌ మధ్య లవ్‌ ట్రాక్‌ కంటే వీరి మధ్య వచ్చే గొడవలే ప్రధానంగా నిలిచేవి. 

27

సోహైల్‌ని సైతం ఎదుర్కొని నిలబడింది అరియానా. తన వాయిస్‌తో, బోల్డ్ నెస్‌తో హౌజ్‌ని రక్తికట్టించింది. అవినాష్‌తో కెమిస్ట్రీ పండిస్తూనే సోహైల్‌తో టగ్‌ ఆఫ్‌ వార్‌కి దిగుతూ నువ్వా నేను అనిపించుకుంది. ఆ సీజన్‌లో సోహైల్‌, అరియానా గొడవలు పీక్‌లోకి వెళ్లాయి. బిగ్‌బాస్‌ ప్రియులకు కావాల్సినంత ఎంటర్టైన్‌మెంట్‌ని పంచాయి. 
 

37

ఇప్పుడు బిగ్‌బాస్‌5లో వాళ్లని మించిపోతున్నాడు సన్నీ, ప్రియా. ప్రారంభం నుంచి నెమ్మదిగా ఆడిన సన్నీ గత వారం నుంచి రెచ్చిపోతున్నాడు. అటు హౌజ్‌మేట్స్ కి, ఇటు ఆడియెన్స్ కి కావాల్సినంత వినోదాన్ని పంచుతున్నాడు. తనదైన పంచ్‌లు, డైలాగులు, అమాకత్వంతో కూడిన పనులతో హైలైట్‌ అవుతున్నాడు. 

47

అయితే మొదట్నుంచి ప్రియాకి, సన్నీకి పడటం లేదు. చిన్న ఫిల్లోస్‌ని దక్కించుకునే టాస్క్ నుంచి వీరి మధ్య చెడింది. ఆ సమయంలోనే నువ్వు మగాడివైతే రా.. అంటూ ప్రియా ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆ సమయంలోనే సన్నీ తనదైన స్టయిల్‌లో రియాక్ట్ అవుతూ వస్తున్నాడు. పదే పదే వీరి మధ్య ఇలాంటి టామ్‌ అండ్‌ జెర్రీ ఫైట్స్ జరుగుతూనే ఉన్నాయి. ఏడో వారంలో అవి మరింతగా పెరిగాయి. 

57

ఏడో వారం నామినేషన్ల ప్రక్రియలోనూ ప్రియాని పరోక్షంగా టార్గెట్‌ చేశాడు సన్నీ. మంగళవారం ఎపిసోడ్‌లో అది మరింతగా పెరిగింది. ప్రియా పదే పదే సన్నీని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించింది. `బంగారు కోడిపెట్టా` అనే టాస్క్ లో ప్రియా.. `నేను అందరి గుడ్ల జోలికొస్త, దొంగతనం చేస్తా, ఎవరేం చేసుకుంటారో చేసుకోండి` అంటూ సెటైర్లు వేసింది. సన్నీ బుట్టలోని గుడ్లను అదును చూసి మాయం చేసింది ప్రియ. తన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరైందని బాధపడ్డ సన్నీ తన జోలికొస్తే ఊరుకోనని వార్నింగ్‌ ఇచ్చాడు. దీంతో స్పందించిన ప్రియ ఆ గుడ్లను తానే దోచుకున్నానని చెప్పింది.

67

అందుకే సన్నీ స్పందిస్తూ, చేతగానోళ్లలాగా ఒక మూలన కూచోవడం కాదు, మంచిగా గేమ్‌ ఆడు అంటూ సూచించాడు సన్నీ. నేను బరాబర్‌ దొంగతనం చేస్తానని కౌంటరిచ్చింది ప్రియ. తనను రెచ్చగొట్టడంతో ఆవేశపడ్డ సన్నీ అక్కడున్న కడ్డీని కొట్టాడు. దీంతో కామన్‌ సెన్స్‌ వాడంటూ మరింత రెచ్చిపోయింది ప్రియ. 

77

నేటి ఎపిసోడ్‌కి సంబంధించి ప్రోమోలో ప్రియా,సన్నీలు గొడవ పడటం, సన్నీని కొట్టేందుకు ప్రియా చేయి లేపడం హీటుని పెంచుతుంది. చెంపపగల గొడతానంటూ ప్రియా, ఏయ్‌ అంటూ సన్నీ ఒకరిపై ఒకరు రెచ్చిపోయారు. కొట్టుకునే స్థాయికి వెళ్లారు. వీరిని ఇంటిసభ్యులు అడుకునే ప్రయత్నం చేశారు. ఫిజికల్‌ దాడులకు దిగబోయారు. ఇప్పటి వరకు హౌజ్‌లో ఈ స్థాయిలో గొడవ జరగడం ఇదే ఫస్ట్ టైమ్‌. మరి బుధవారం ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో అనేది ఆసక్తికరంగా మారింది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories