Published : Dec 23, 2022, 04:16 PM ISTUpdated : Dec 23, 2022, 04:57 PM IST
ఓవర్‌నైట్ సెన్సేషన్ ప్రియా ప్రకాష్ వారియర్ అందాల ఆరబోతలో ముందే ఉంటుంది. తాను ఏమాత్రం వెనకడుగు వేయకుండా కుర్రాళ్లకి గ్లామర్ డోస్ ఇస్తుంది. నెట్టింట రచ్చ చేస్తుంది.
కన్నుగీటుతో ఓవర్‌నైట్‌లో స్టార్ అయిపోయిన ప్రియా ప్రకాష్ వారియర్ హాట్ హాట్ అందాలను ఆవిష్కరిస్తూ కుర్రాళ్ల మతులు గతులు తప్పేలా చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ మరోసారి రెచ్చిపోయింది. అందాల అప్సరసా మారిపోయింది. అందానికే అసూయ పుట్టించేలా మారిపోయింది.
27
Photo Credit-Priya Prakash Varrier Instagram
లేటెస్ట్ గా దిగిన ఫోటోలను అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది ప్రియా ప్రకాష్ వారియర్. ఇందులో దేవ కన్య తరహాలోనే పోజులివ్వడం విశేషం. దీంతో ఈ వింకీ బ్యూటీ గ్లామర్ ఫోటోలపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆ బ్రహ్మే అందం పోత పోస్తే నీలానే ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు. అంతకు మించిన కామెంట్లతో ప్రియా ప్రకాష్ వారియర్ అందాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
37
Photo Credit-Priya Prakash Varrier Instagram
కన్నుగీటుతో ఓవర్ నైట్‌లో స్టార్ అయిపోయింది. తన తొలి సినిమా `ఓరు అదార్ లవ్` చిత్రంలోని ఓ పాటలో ఆమెని కన్నుకొట్టిన తీరుకి కుర్రాళ్ల లోకమంతా ఫిదా అయిపోయింది. సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోయింది. ఆమె కన్నుగీటే వీడియో క్లిప్స్ అత్యంత వైరల్‌గా మారింది.
47
Photo Credit-Priya Prakash Varrier Instagram
ప్రియా ప్రకాష్ నటించిన ఈ పాటలోని క్లిప్‌తో ఈ సినిమాకి క్రేజ్ వచ్చింది. కోట్లాది ప్రమోషన్ ఫ్రీగా వచ్చినట్టయ్యింది. వింకీ బ్యూటీకి స్టార్ హీరోయిన్ల రేంజ్‌లో క్రేజ్ వచ్చింది. అల్లు అర్జున్ లాంటి హీరోలే ఆమె కన్నుగీటుకు ఫిదా అయిపోయారంటే అతిశయోక్తి కాదు. అంతగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీకి ఆఫర్లు కూడా బాగానే వచ్చాయి.
57
Photo Credit-Priya Prakash Varrier Instagram
ఆ తర్వాత ఛాన్స్ లు వచ్చినా విజయాలు రాలేదు. దీంతో ఈ అమ్మడు ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. రావాల్సిన సక్సెస్ రాకపోవడంతో స్టార్డమ్‌కి దూరమయ్యింది. అయితే ఇప్పుడు మళ్లీ నటిగా తానేంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. తెలుగులో ఇప్పటికే `చెక్` చిత్రంలో నితిన్‌కి లవ్ ఇంట్రెస్ట్ గా చేసింది. దీంతోపాటు `ఇష్క్` సినిమాలోనూ మెరిసింది. అది కూడా పెద్దగా ఆడలేదు. దీంతో ప్రియా ప్రకాష్ వారియర్ స్ట్రగులింగ్ హీరోయిన్లలో, అప్‌కమింగ్ హీరోయిన్లలో ఒకరిగానే మారిపోయారు.
67
Photo Credit-Priya Prakash Varrier Instagram
అయితే ప్రస్తుతం ఈ మలయాళ బ్యూటీ చేతిలో మాత్రం అరడజనుకుపైగా చిత్రాలుండటం విశేషం. `విష్ణ ప్రియా` అనే కన్నడ మూవీ, మలయాళంలో `కొల్లా`, `ఓరు నాల్పతుకారంతే ఇరుపథోన్నుకారి`తోపాటు హిందీలో నాలుగు సినిమాలు చేస్తుంది. అందులో `శ్రీదేవి బంగ్లా`, `యారియాన్ 2`, `3 మంకీస్`, `లవ్ హ్యాకర్స్` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
77
Photo Credit-Priya Prakash Varrier Instagram
మరోవైపు తరచూ ఇలా గ్లామర్ షో చేస్తూ హాట్ ఫోటో షూట్లు చేస్తుంది. వాటిని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుని నెటిజన్ల ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. కమర్షియల్ యాడ్స్ దక్కించుకుంటూ రెండు చేతులా సంపాదిస్తుందీ హాట్ బ్యూటీ.