గ్రీన్ డ్రెస్ లో పద్ధతిగా మెరిసిన మలయాళీ భామ.. క్యూట్ లుక్స్ తో మైమరిపిస్తున్న ప్రియా వారియర్..

First Published | Jun 17, 2023, 3:58 PM IST

కన్ను గీటు వీడియోతో ప్రియా ప్రకాష్ వారియర్ ఓవర్ నైట్ లో స్టార్ డమ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోను తెగ సందడి చేస్తోంది. 
 

మలయాళీ యంగ్ హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ (Priya Prakash Varrier)  చేతిలో ప్రస్తుతం చాలానే సినిమాలున్నాయి. తెలుగు, తమిళం, మలయాళం, హిందీలో ఆయా చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 
 

ప్రియా వారియర్ నటించిన  మలయాళ చిత్రం  తెలుగులో ‘లవర్స్’గా విడుదలైంది. ఈ చిత్రంలోనే కన్నుగీటే వీడియో  సెన్సేషనల్ గా మారింది. ఈ సినిమా ప్రియాకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. కానీ ఆ తర్వాత వచ్చిన చిత్రాలకు పెద్దగా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. 
 


ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ప్రియా ఫ్యాన్స్ తో మరింత టచ్ లో ఉండేందుకు ప్రయత్నిస్తోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ ను, నెటిజన్లు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
 

వరుసగా పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా నయా లుక్స్ లో ఫొటోషూట్లు చేస్తూ అదరగొడుతోంది. కొద్దిరోజుల కింద వెకేషన్ పిక్స్ తో మంటలు రేపింది. ప్రస్తుతం ట్రెడిషనల్ లుక్స్ లో దర్శనమిస్తూ మైమరిపిస్తోంది. లేటెస్ట్ పిక్స్ బ్యూటీఫుల్ గా ఉన్నాయి. 
 

తాజాగా ప్రియా వారియర్ షేర్ చేసుకున్న ఫొటోల్లో ఈ ముద్దుగుమ్మ బాపూబొమ్మలా మెరిసింది. నిండైన దుస్తుల్లో పద్దతిగా మెరిసింది. క్యూట్ లుక్స్ తో, మత్తెక్కించే ఫోజులతో కుర్రాళ్లను చూపుతిప్పుకోకుండా చేసింది. ప్రంటూ, బ్యాక్ ఫోజులిస్తూ కట్టిపడేసింది. 

ఇదిలా ఉంటే తెలుగులో ప్రియా వారియర్ గతంలో రెండు చిత్రాలు ‘చెక్’, ‘ఇష్క్ : నాట్ ఏ లవ్ స్టోరీ’లో నటించింది. పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ - సాయిధరమ్ తేజ్ నటించిన ’బ్రో : ది అవతార్’తో అలరించేందుకు సిద్ధమైంది. ఈ సినిమాతోనైనా హిట్ కొడుతుందా చూడాలి. వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోందీ చిత్రం.
 

Latest Videos

click me!