మరోవైపు తనపై వచ్చిన రూమర్లకి రియాక్ట్ అవుతూ, తెలిసిన, క్లోజ్‌గా ఉన్న ఎవరైనా బాధలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు వారికి సపోర్ట్ గా నిలవడమనేది కామన్. నేనూ అదే చేశాను. సమంత క్లోజ్ కావడంతో ఆమెకి సపోర్ట్ గా ఉన్నాను, అంతేకాని తమ మధ్య ఏం లేదని, బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ అని చెప్పాడు. దాన్ని కొందరు తప్పు పట్టడం బాధగా అనిపించిందన్నారు. తాను చాలా అగ్రెసివ్ పర్సన్ అని, తనపై ఏదైనా కామెంట్ వస్తే తట్టుకోలేనని, ఒక చెప్ప దెబ్బకొడితే పది దెబ్బలు కొట్టే రకమని తెలిపారు. తనపై కామెంట్ చేయడానికి వాళ్లు ఎవరంటూ ప్రశ్నించారు. వారికి మాకు సంబంధం ఏంటని ఆయన ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అప్పుడు తాను ఇలానే రియాక్ట్ అయ్యాయని, అయితే అది తన కెరీర్‌కి ఎఫెక్ట్ అవుతుందని కొందరు హెచ్చరించారని తెలిపారు.