The Goat Life movie review
ది గోట్ లైఫ్ మూవీ ఆడు జీవితం అనే మలయాళ నవల ఆధారంగా తెరకెక్కింది. ఆడు జీవితం నిజ జీవిత కథ. బెన్నీ డానియల్ ఈ నావెల్ రాశారు. సౌదీ అరేబియాకు పని కోసం వెళ్లిన ఓ యువకుడి జీవితం ఎంతటి దుర్భరంగా మారిందనేది కథ. దర్శకుడు బ్లేస్సి ఆడు జీవితం నావెల్ ని 2008లోనే సినిమాగా తీయాలనే ఆలోచన చేశారు.
The Goat Life movie review
అయితే బడ్జెట్ పరిమితులతో పాటు అనేక కారణాల వలన 16 ఏళ్లకు ది గోట్ లైఫ్ మూవీ తెరపైకి వచ్చింది. పృథ్విరాజ్ సుకుమారన్, అమలా పాల్ ప్రధాన పాత్రలు చేశారు. ది గోట్ లైఫ్ మూవీ సర్వైవల్ డ్రామాగా తెరకెక్కింది. సౌదీ అరేబియా వెళ్లిన నజీబ్ అహ్మద్ పాత్రలో పృథ్విరాజ్ సుకుమారన్ నటించారు.
The Goat Life movie review
ది గోట్ లైఫ్ చిత్ర కథ విషయానికి వస్తే... కుటుంబ అవసరాల కోసం నజీబ్ అహ్మద్ వలస కూలీగా సౌదీ అరేబియా వెళతాడు. అనుకోకుండా నజీబ్ సౌదీ అరేబియాలో తప్పిపోతాడు. గల్ఫ్ లో పని చేసి డబ్బులు సంపాదించి కుటుంబానికి అండగా నిలవాలనుకున్న నజీబ్ కల చెదిరిపోతుంది. ఏడారిలో బానిసగా మారి గొర్రెల కాపరిగా దుర్భరమైన జీవితాన్ని గడపాల్సి వస్తుంది. మరి నజీబ్ తిరిగి ఇండియాకు వచ్చాడా? బానిస సంకెళ్ళ నుండి బయటపడ్డాడా? అనేది మిగతా కథ...
The Goat Life Movie
ది గోట్ లైఫ్ చిత్రాన్ని పృథ్విరాజ్ సుకుమారన్ అన్నీ తానై నడిపించాడు. ఆయన నటన, షాకింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అబ్బురపరుస్తాయి. నజీబ్ పాత్రలో పృథ్విరాజ్ జీవించాడని ఆడియన్స్ అభిప్రాయ పడుతున్నారు. ఇది ఆయన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ అంటున్నారు .
The Goat Life Movie
అమలా పాల్ తన పాత్ర పరిధి మేర మెప్పించింది అంటున్నారు. పృథ్విరాజ్ తర్వాత దర్శకుడు బ్లేస్సి స్టోరీ టెల్లింగ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు ఆడియన్స్. నజీబ్ ట్రాజిక్ లైఫ్ ని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించాడు బ్లేస్సి. విజువల్స్ గొప్పగా ఉన్నాయి. సినిమాటోగ్రాఫర్ పనితనం గురించి ఆడియన్స్ మాట్లాడుకుంటున్నారు.
The Goat Life Movie
అలాగే ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ సన్నివేశాలను ఎలివేట్ చేసింది. ఎమోషన్ పండటంలో సహకరించింది అంటున్నారు. ఎలాంటి కమర్షియల్ అంశాలు లేని ఈ ఆర్టిస్టిక్ మూవీ ప్రేక్షకులను మెప్పిస్తుంది అంటున్నారు. ది గోట్ లైఫ్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక కమర్షియల్ గా ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి...