Guppedantha Manasu 28th March Episode:మనుపై ఏంజెల్ మరదలి ప్రేమ, అనుపమను ఎదురించిన వసుధార

Published : Mar 28, 2024, 08:45 AM IST

వాళ్లు నిన్ను ప్రశ్నించడంలో తప్పు లేదు కదా అని ఆవిడ అంటే.... నాకు నచ్చినట్లు నేను బతుకుతున్నాను అని.. వాళ్లు ఎందుకు అడగాలి అని అనుపమ అంటుంది.

PREV
19
Guppedantha Manasu 28th March Episode:మనుపై ఏంజెల్ మరదలి ప్రేమ, అనుపమను ఎదురించిన వసుధార
Guppedantha Manasu

Guppedantha Manasu 28th March Episode:అనుపమ పెద్దమ్మ... మను ఇంకా ఇంటికి రాలేదని ఆలోచిస్తూ ఉంటుంది. అసలే మను ఆకలికి ఉండలేడని... ఎక్కడున్నాడో, ఎప్పుడొస్తాడో అని కంగారుపడుతూ ఉంటుంది. అప్పుడే... అనుపమ ఫోన్ చేస్తుంది. వాడు ఇంటికి వచ్చాడా అని అడుగుతుంది. వాడు అంటే ఎవరు అని ఆమె అడిగితే.. ఇంకెవరు మను అని చెబుతుంది. ఇంకా రాలేదు అని పెద్దావిడ చెబుతుంది. ఇంకా రాకపోవడం ఏంటి..? అని అనుపమ ప్రశ్నిస్తే... ఏ చెట్టుకో, పుట్టకో తన బాధ చెప్పుకుంటూ ఉంటాడు... మనుషులతో వాడి బాధను చెప్పుకొని చాలా రోజులు అయ్యింది కదా అని అంటుంది.

29
Brahmamudi

తర్వాత.. అనుపమ తన బాధ చెప్పుకోవడం మొదలుపెడుతుంది. మను తో నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు.. మీరు మునుపటిలా ఎందుకు ఉండటం లేదు అని అందరూ ప్రశ్నిస్తున్నారని చెబుతుంది. ఉదయం దేవయాణి వచ్చి అడిగిందని,.. ఏంజెల్, వసుధారలు కూడా చాలా ప్రశ్నలు వేశారని, మహేంద్ర అయితే ఏకంగా నిలదీశాడు అని చెబుతుంది. మరి నువ్వేం సమాధానం చెప్పావ్ అని అడుగుతుంది. నేను ఏం సమాధానం చెబుతానో నీకు తెలీదా అంటుంది. అయినా.. వాళ్లు నిన్ను ప్రశ్నించడంలో తప్పు లేదు కదా అని ఆవిడ అంటే.... నాకు నచ్చినట్లు నేను బతుకుతున్నాను అని.. వాళ్లు ఎందుకు అడగాలి అని అనుపమ అంటుంది.

39
Guppedantha Manasu

సరే ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావ్ అని పెద్దమ్మ అడిగితే.. నీ మీద కాకుండా నేను ఇంక ఎవరి మీద అరుస్తాను అని, ఇదంతా నీ వల్లే కదా.. అందుకే మను ని పంపిచేయమంటే.. నువ్వు పంపించలేదు అని అంటుంది. నువ్వు ఎలా వచ్చావో.. వాడు అలానే వచ్చాడు అని ఆవిడ అంటుంది, కానీ.. అనుపమ మాత్రం తాను వచ్చిన కారణం వేరని అంటుంది. కానీ.. ఇద్దరూ సమస్యలు తీర్చడానికే వచ్చారు అని పెద్దావిడ అంటే.. తనకు సమస్య అయ్యి కూర్చున్నాడని అనుపమ అంటుంది.

 

49
Guppedantha Manasu

మరి ప్రాణాలు ఎందుకు కాపాడావ్ అని పెద్దావిడ అంటే.. ఆ స్థానంలో ఎవరు ఉన్నా తాను కాపాడే దానిని అని అనుపమ అంటుంది. వీళ్లు ఇలా మాట్లాడుకుంటూ ఉంటుండగానే.. మహేంద్ర... మనుని తీసుకొని వస్తాడు. తీసుకొని రావడమే అనుపమ అని పిలుస్తూ ఉంటాడు. మను వద్దు పిలవొద్దని చెప్పినా..,మహేంద్ర పిలుస్తూనే ఉంటాడు. మను వచ్చాడు రమ్మని చెబుతాడు. అయితే... అనుపమ వినపడినా.. వినపడనట్లు నటిస్తుంది. ఇంకా ఫోన్ మాట్లాడుతూనే ఉంటుంది. 

59
Guppedantha Manasu

ఇక.. మను.. మేడమ్ కి ట్యాబ్లెట్స్ తీసుకొని వచ్చాను అని మను చెబుతాడు. ఎందుకు వచ్చావ్ అని నేను అడగలేదు కదా అని మహేంద్ర అంటే... చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా నాకు అని మను అంటాడు. నీకు అన్ని బాధ్యతలు తెలుసు అని... నిన్ను చూసినప్పుడే నీ పేరెంట్స్ గొప్పవాళ్లు అని అనుకునేవాడిని అని... ఇప్పుడు అనుపమ కొడుకు అని తెలిసాక చాలా సంతోషంగా ఉంది అని మహేంద్ర అంటాడు. పేరెంట్స్ తో కలిసి బతకలేని తనదేమి అదృష్టం లే అని మను అనుకుంటాడు.

69
Guppedantha Manasu

అప్పుడే ఏంజెల్ ఎంట్రీ ఇస్తుంది. హాయ్ బావ అనుకుంటూ వస్తుంది. బావ అని పిలిచే సరికి మను షాకౌతాడు. వెంటనే సారీ అని చెప్పి.. మనుగారు అని అంటుంది. ఎప్పుడు వచ్చారు..? అత్తయ్యను చూడటానికి వచ్చారు అని అడుగుతుంది. అయితే.. మను ని బావ అనే పిలవమని మహేంద్ర అంటాడు. వెంటనే మనుని కూడా  అడుగుతాడు. నువ్వు ఏమైనా అనుకుంటావా అని.. అయితే.. మను గురించి కాదు.. అనుపమ అత్తయ్య ఏమనుకుంటుందో అని పిలవడం లేదు అని అంటుంది. మీ అత్తయ్యకు భయపడ్డావా అని కాసేపు మహేంద్ర సరదా పట్టిస్తాడు..

తర్వాత.. మను ట్యాబ్లెట్స్ మేడమ్ కి ఇవ్వండి..నేను వెళ్లిపోతాను అంటాడు. కానీ మహేంద్ర ఒప్పుకోడు. నువ్వు మీ అమ్మతో కాసేపు సమయం గడపాలి అని చెబుతాడు.ట్యాబ్లెట్స్ కూడా నువ్వే మీ అమ్మకి ఇవ్వాలి అని మమహేంద్ర అంటాడు. ఇక వసుధార కూడా మీరే ఇవ్వాలి అని అంటుంది. నేను ఇవ్వలేను అని మను అంటాడు. కానీ.. వసుధార వదిలిపెట్టదు. ఇప్పుడు ఆవిడ గాయంతో ఉందని.. మీ మధ్య ఎన్ని మనస్పర్థలు ఉన్నా.. మీరు ఆమె పక్కనే ఉండాలి అని చెబుతుంది. కానీ.. తాను ఉండటం అనుపమకు నచ్చదు అని మను అంటాడు. 

79
Guppedantha Manasu

ఇక.. వసుధర తల్లి మనసు అలాంటిది.. ఇలాంటిది అని చెప్పి.. వెళ్లి అనుపమ మేడమ్ ని పలకరించమని ఒత్తిడి చేస్తుంది. ఇక.. మనుకి తప్పక వెళతాడు. భోజనం కూడా ఇక్కడే చేయాలి అని వసుధార మరీ మరీ చెబుతుంది. మరి మను కోసం వంట చెయ్యమని మహేంద్ర అంటే.. ఆల్రెడీ చేశాను అని.. మను వస్తాడని ముందే తనకు తెలుసు అని వసు అంటుంది.

ఇక.. మను చాలా ఇబ్బందిగా అనపమ దగ్గరికి వెళతాడు. ఎలా ఉంది అని అడుగుతాడు... అయితే... ఎందుకు వచ్చావ్ అని అనుపమ అడుగుతుంది. ఆ మాటకు మను బాధపడినా.. వెళ్లిపోతాను మేడమ్.. ఆరోజే వెళ్లిపోయేవాడిని అని.. కానీ... మీకు అలా అవ్వడంతో వెళ్లకుండా ఆగిపోయాను అని చెబుతాడు. అసలు ఎందుకు వచ్చావ్ అని అడుగుతుంది.,.. కాలేజీ సమస్యలో ఉందని మాత్రమే వచ్చాను అని.. వెంటనే వెళ్లిపోదాం అనుకున్నాను కానీ.. ఇంకా కాలేజీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయని వెళ్లలేదని చెబుతాడు. కానీ నీ వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను అని.. అందరూ తనను ప్రశ్నలతో వేధిస్తున్నారు అని అంటుంది.
 

89
Guppedantha Manasu

తాను కూడా పాతికేళ్లుగా ఇలాంటి  ఒక్క ప్రశ్నతో ఇబ్బంది పడ్డాను అని మను చెబుతాడు. కానీ.. అనుపమ మనుని అక్కడి నుంచి వెళ్లిపొమ్మని కసరుకుంటుంది. కానీ.. వసుధార వచ్చి ఆపుతుంది. ఎందుకు వెళ్లాలి..? ఎక్కడికి వెళ్లాలి..? వెళ్లడని చెబుతుంది. అసలు ఎందుకు రానిచ్చావ్ అని అనుపమ అడిగితే... ఇక.. తల్లీ , కొడుకుల బంధం గురించి వసుధార చెప్పడం మొదలుపెడుతుంది. మనుకి కొడుకుగా అన్ని హక్కులు ఉన్నాయని... మీరే కాదు.. ఆ దేవుడు కదు అన్నా.. మను మీ కొడుకే అవుతాడు అని చెబుతుంది.

99
Guppedantha Manasu

వసుధార మాటలకు మహేంద్ర మురిసిపోతాడు. తన కోడలు చాలా గొప్పగా మాట్లాడిందని అంటాడు. ఈ లోగా ఏంజెల్ భోజనానికి రమ్మని పిలుస్తుంది. అయితే.. అనుపమ తనకు ఆకలిగా లేదని చెబుతుంది. తాను ఉంటే మేడమ్ తినరని.. నేను వెళ్లిపోతాను అని మను అంటాడు. కానీ మహేంద్ర ఆపుతాడు. మను ఇక్కడ భోజనం చేస్తే నీకు ఏమైనా ప్రాబ్లమా అని  అనుపమను అడుగుతాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

click me!

Recommended Stories