పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ పార్ట్-1: సీజ్‍ఫైర్’ సినిమా గతేడాది డిసెంబర్‌లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ కూడా ప్రధాన పాత్ర పోషించారు.కేజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాను హైవోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది .
త్వరలోనే ‘సలార్ పార్ట్ 2: శౌర్యాంగపర్వం’ షూటింగ్ మొదలు కాబోతుంది.ఈ సినిమాలో పృథ్వీ రాజ్ సుకుమారన్ వరదరాజ మన్నార్ ,శివ మన్నార్ అనే రెండు పాత్రలు చేసారు. ఈ క్రమంలో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran)ఓ ఇంటర్వ్యూలో రక రకాల విషయాలపై ఆయన స్పందించారు. ‘‘సలార్ 2’ సినిమాలో నటించడంపై స్పష్టతనిచ్చారు. అలాగే ప్రభాస్ గురించి మాట్లాడారు.
23
'సలార్ 2' గురించి అడగగా ‘‘సలార్ 2’ తప్పకుండా చేస్తాం. ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ ఓ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా కంప్లీట్ అయ్యాక ‘సలార్ 2’ స్టార్ట్ అవుతుంది’’ అంటూ సమాధానమిచ్చారు.
ప్రభాస్ గురించి అడగగా ‘‘ప్రభాస్‌కు ఉన్న స్టార్‌డమ్ ఆయనకు తెలీదు. నాకు తెలిసినంత వరకూ ఆయన సోషల్‌మీడియా కూడా ఉపయోగించరు. ప్రైవేట్ పర్సన్. అత్యంత సన్నిహితులతోనే అన్ని విషయాలు పంచుకుంటారు’’ అని తెలిపారు. ‘సలార్’ వల్ల ప్రభాస్ నుంచి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని అన్నారు.
33
Prashanth Neels Prithviraj Prabhas film Salaar audience response review out
రాజమౌళి సినిమాలో మీరు విలన్ గా నటిస్తున్నారట కదా అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ‘‘నాకంటే మీకే చాలా విషయాలు తెలిశాయి. ఇంకా ఏదీ స్పష్టత రాలేదు. చర్చలు జరుగుతున్నాయి. అవి ఫైనల్ అయ్యాక దీని గురించి మాట్లాడుకుందాం’’ అన్నారు. భారీ బడ్జెట్‌తో SSMB 29 రూపొందుతోంది.
దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్నారు. ప్రపంచాన్ని చుట్టేసే ఓ సాహస ప్రయాణంగా, అటవీ నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రం రూపొందుతోంది. గతేడాది చివర్లో ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. ప్రియాంక చోప్రా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి లీక్‌లు లేకుండా చిత్రబృందం పలు జాగ్రత్తలు తీసుకుంటుంది.