వెట్రిమారన్ పై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దర్శకునితో మాకు సినిమా వద్దని తారక్ కూడా సినిమా చెయ్యడానికి లేదు అని పోస్ట్ లు పెడుతున్నారు. ఏదైమైనా ఇది ఈ చిన్న సినిమాకు పెద్ద పబ్లిసిటీ జరుగుతోందననేది నిజం.
చిన్న సినిమాలకు వివాదమే బలం అని చాలా మంది మేకర్స్ నమ్ముతూంటారు. అయితే కంటెంట్ ని నమ్ముకుని ముందుకెళ్లే వెట్రిమారన్ వంటి దర్శకులు కూడా ఇలా చేయాలా అంటున్నారు. ఆయన నిర్మిస్తున్న చిత్రం 'బ్యాడ్ గర్ల్' టీజర్ రిలీజై వివాదంలో ఇరుక్కుంది. ఈ టీజర్ చూసిన వాళ్లు షాక్ అవుతున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఈ డైరక్టర్ తో తమ హీరో సినిమా చేయద్దని రిక్వెస్ట్ లు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.
ఈ టీజర్ లో పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి. ఈ సినిమాకు వెట్రి మారన్ నిర్మాత అయితే, హిందీ దర్శకుడు అనురాగ్ కశ్యప్ సమర్పకులు. ఈ చిత్రానికి వర్ష భారత్ దర్శకత్వం వహించారు. అంజలి శివరామన్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాతో సీనియర్ నటి శాంతి ప్రియ రీ ఎంట్రీ ఇస్తున్నారు.
23
bad girl
'బ్యాడ్ గర్ల్' టీజర్ లో ఏముది
'బ్యాడ్ గర్ల్' టీజర్ లో సంప్రదాయాలు పాటించే బ్రాహ్మణ మధ్యతరగతి తమిళ అమ్మాయి, తనకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండాలని భావిస్తుంది. క్లాసులో తనకు నచ్చిన అబ్బాయి తో ఒక రోజు ఎవరూ లేని క్లాస్ రూమ్ లో రొమాన్స్ చేస్తుండగా టీచర్ కంట పడుతుంది. మార్కులు తక్కువ వచ్చినప్పుడు ఏమీ అనని తండ్రి ఆ విషయం తెలిసి కొడతాడు.
ఆ తర్వాత తనకు స్వేచ్ఛ కావాలని ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. సిగరెట్ కలుస్తుంది. మందు తాగుతుంది. పార్టీలకు, పబ్బులకు వెళుతుంది. నచ్చిన యువకుడితో రొమాన్స్ చేస్తుంది. తనకు నచ్చినట్టు ఉంటుంది. ఇలాంటి విషయాలతో టీజర్ సాగుతుంది.
33
bad girl
ఈ సినిమాలో ఒక హిందువల అమ్మాయిని చాలా బోల్డ్ గా చూపించడం హిందువులు, బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బ తీశాయి. దీనితో సోషల్ మీడియాలో వెట్రిమారన్ ని ఆడిపోసుకుంటున్నారు. కేవలం వెట్రి మారన్ నే కాకుండా ఈ టీజర్ షేర్ చేసిన హీరో విజయ్ సేతుపతి, పా రంజిత్ లని కూడా ఘోరంగా తిడుతున్నారు. విజయ్ సేతుపతి కామెంట్స్ సెక్షన్ క్లోజ్ చేసేసారు.
దీనితో పాటుగా వెట్రిమారన్ పై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దర్శకునితో మాకు సినిమా వద్దని తారక్ కూడా సినిమా చెయ్యడానికి లేదు అని పోస్ట్ లు పెడుతున్నారు. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఎన్టీఆర్, వెట్రిమారన్ కాంబినేషన్ లో సినిమా ప్రకటన అయితే రాలేదు. వెట్రిమారన్ అంటే ఇష్టమని, ఆయన తో సినిమా చెయ్యాలని ఉందని ఎన్టీఆర్ గతంలో అన్నారు. ఏదైమైనా ఇది ఈ చిన్న సినిమాకు పెద్ద పబ్లిసిటీ జరుగుతోందననేది నిజం.