Prince Movie Review: ప్రిన్స్ మూవీ ప్రీమియర్ టాక్... జాతిరత్నం డైరెక్టర్ స్టార్ హీరోతో సక్సెస్ కొట్టాడా?

First Published | Oct 21, 2022, 6:38 AM IST

వరుస విజయాలతో జోరుమీదున్న శివ కార్తికేయన్ ప్రిన్స్ గా ప్రేక్షకులను ఫ్యాన్స్ ని పలకరించడానికి వచ్చేశాడు. అక్టోబర్ 21న ప్రిన్స్ గ్రాండ్ గా విడుదలైంది. దర్శకుడు అనుదీప్ కేవీ తెరకెక్కించిన ప్రిన్స్ ప్రీమియర్స్ ప్రదర్శన ముగియగా ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. 
 

Prince Movie Review

కథ 
ప్రిన్స్ మూవీ కథ చెప్పాలంటే చాలా సింపుల్. స్కూల్ టీచర్ అయిన శివ కార్తికేయన్ అదే స్కూల్ లో ఇంగ్లీష్ టీచర్ గా పని చేస్తున్న మారియా రబోషప్క ప్రేమలో పడతాడు. ఆమెను ఇంప్రెస్ చేయడానికి నానా పాట్లు పడతాడు. ఇక కోరుకున్న అమ్మాయిని పెళ్లాడే క్రమంలో హీరో అనేక సమస్యలు ఎదుర్కొంటాడు. ఆ సమస్యలు, ఇబ్బందులు ఏమిటీ? మారియాను శివ కార్తికేయన్ ఎలా దక్కించుకున్నాడు? అనేది మిగతా కథ... 

Prince Movie Review


కోలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరిగా శివ కార్తికేయన్ ఎదిగాడు. ప్రస్తుతం ఆయనకంటూ ఒక ఫ్యాన్ బేస్, ఇమేజ్ ఉంది. అలాగే శివ కార్తికేయన్ నటించిన గత రెండు చిత్రాలు డాక్టర్, డాన్ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. ముఖ్యంగా డాక్టర్ శివ కార్తికేయ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ క్రమంలో శివ కార్తికేయన్ చిత్రం అనగానే ఆటోమేటిక్ గా అంచనాలు ఏర్పడుతున్నాయి. 
 


Prince Movie Review


ఇక మొదటి సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు అనుదీప్ కేవీ రెండో సినిమాతోనే లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. అనుదీప్ డెబ్యూ మూవీ జాతిరత్నాలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో కొత్త డైరెక్టర్ అయినప్పటికీ శివ కార్తికేయన్ నమ్మి అవకాశం ఇచ్చాడు. మరి ఆ నమ్మకాన్ని అనుదీప్ ఎంత వరకు నిలబెట్టుకున్నాడనేది ఆసక్తికరం. 
 

Prince


ప్రీమియర్స్ ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ప్రిన్స్ డీసెంట్ టాక్ సొంతం చేసుకుంది. శివ కార్తికేయన్ ప్రెజెన్స్ సినిమాకు హైలెట్. ఆయన కామెడీ టైమింగ్, మాస్ మేనరిజం, హీరోయిన్ తో రొమాంటిక్ సన్నివేశాలు అలరిస్తాయి. శివ కార్తికేయన్ మరోసారి ఒంటి చేత్తో సినిమాను నడిపించారు. వన్ లైనర్స్ ఆకట్టుకున్నాయి అంటున్నారు. 


ఇక హీరోయిన్ మారియా గ్లామర్ కి ప్రేక్షకులు మంచి మార్కులు వేస్తున్నారు. శివ కార్తికేయన్ తో ఆమె కెమిస్ట్రీ బాగుంది అంటున్నారు. ఆమె డబ్బింగ్ పర్లేదన్న మాట వినిపిస్తోంది. 

Sivakarthikeyan Prince


ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. థమన్ మ్యూజిక్ పట్ల పాజిటివ్ స్పందన వస్తుంది. ఎప్పటిలాగే బీజీఎమ్ అదుర్స్ అంటున్నారు. పాటలకు మాత్రం యావరేజ్ మార్కులు వేస్తున్నారు. ఇక దర్శకుడు అనుదీప్ పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదన్న మాట కూడా వినిపిస్తుంది. ఆయన రాసుకున్న కామెడీ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. ఫస్ట్ హాఫ్ ఆయన కామెడీ, రొమాన్స్ మీద ఆధారపడి సినిమా నడిపించారు. 
 

శివ కార్తికేయన్ ప్రెజెన్స్, థమన్ బీజీఎమ్, హీరోయిన్ గ్లామర్, యాక్షన్ సన్నివేశాల పట్ల ప్రేక్షకులు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ప్రధానమైన కథ, కథనం మాత్రం నిరాశపరిచినట్లు తెలుస్తుంది. అనుదీప్ నమ్ముకున్న కామెడీ పూర్తి స్థాయిలో వర్క్ అవుట్ కాలేదన్న మాట వినిపిస్తోంది.

Sivakarthikeyan

మొత్తంగా సినిమాకు డీసెంట్ టాక్ వచ్చింది. ఇక సినిమా ఫలితం ఏమిటనేది వీకెండ్ ముగిస్తే కానీ తెలియదు. దర్శకుడు అనుదీప్ కి ప్రిన్స్ విజయం చాలా ముఖ్యం. ప్రిన్స్ హిట్ అయితే ఆయన ఇమేజ్ నెక్స్ట్ లెవల్ కి వెళుతుంది. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశం దక్కుతుంది.

Latest Videos

click me!