Top 10 OTT Movies: ఇండియా వైడ్‌గా దుమ్ములేపుతున్న రజనీకాంత్‌, విశ్వక్‌ సేన్‌.. ప్రైమ్‌ టాప్‌ 10 మూవీస్‌

Published : Nov 25, 2026, 08:27 AM IST

Top 10 OTT Movies: థియేటర్‌ ఎక్స్‌పీరియెన్స్ ఎంత ఉన్నా, ఓటీటీల ఆదరణ పెరుగుతుంది కానీ తగ్గడం లేదు. ఈ క్రమంలో తాజాగా ప్రైమ్‌లో రజనీకాంత్‌, విశ్వక్‌ సేన్‌ సినిమాలు ఓటీటీలో రచ్చ చేస్తున్నాయి.

PREV
15
ప్రైమ్‌ వీడియోస్‌ టాప్‌ 10 ఓటీటీ మూవీస్‌

ఓటీటీలకు ఇప్పుడు విశేష ఆదరణ దక్కుతోంది. థియేటర్లో ఆడని సినిమాలు ఓటీటీలో బ్లాక్‌ బస్టర్‌ అవుతున్నాయి. అటు ఆడియెన్స్ ని, ఇటు మేకర్స్ ని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇక తాజాగా ప్రైమ్‌ వీడియోస్‌ ఓటీటీలో తెలుగు సినిమా దుమ్ములేపుతోంది. అలాగే రజనీకాంత్‌ సినిమా నెంబర్‌ 1గా ట్రెండ్‌ అవుతుంది. మరో కన్నడ చిత్రం కూడా టాప్‌ 10 లిస్ట్ లో ఉండటం విశేషం. మరి ప్రైమ్‌ ఓటీటీలో ఇండియా వైడ్‌గా ట్రెండ్‌ అవుతున్న టాప్‌ 10 సినిమాలేంటో ఓ లుక్కేద్దాం.

25
ప్రైమ్‌లో నెం 1 గా రజనీకాంత్‌ జైలర్‌ 2

ప్రైమ్‌ వీడియోస్‌ ఓటీటీలో ఇండియా వైడ్‌గా మొదటి స్థానంలో ట్రెండ్‌ అవుతున్న చిత్రం `జైలర్‌ 2`. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నటించిన చిత్రమిది. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. ఇందులో రమ్యకృష్ణ, ఎస్‌ జే సూర్య, విద్యా బాలన్‌, యోగిబాబు వంటి వారు కీలక పాత్రలు పోషించారు. మోహన్‌లాల్‌, శివరాజ్‌ కుమార్‌, హృతిక్‌ రోషన్‌ క్యామియో రోల్స్ చేశారు. సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లారు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద రూ.800కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. కానీ వెయ్యి కోట్ల మార్క్ ని టచ్‌ చేయలేకపోయింది. ఈ నెల 12 నుంచి ప్రైమ్‌లోకి వచ్చిన ఈ మూవీ ఓటీటీలో దుమ్మురేపుతోంది. ఇండియా వైడ్‌గా ట్రెండ్‌ అవుతుండటం విశేషం.

35
రెండో స్థానంలో తమన్నా చిత్రం

ఇక రెండో స్థానంలో బాలీవుడ్‌ మూవీ `ది వాన్‌ః ఫోర్స్ ఆఫ్‌ ది ఫారెస్ట్` ఉంది. ఫాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి దీపక్‌ కుమార్‌ మిశ్ర దర్శకుడు. ఇందులో సిద్ధార్థ్‌ మల్హోత్రా, తమన్నా జంటగా నటించారు. సిద్ధార్థ్‌ ద్విపాత్రాభినయం చేశారు. సెప్టెంబర్‌ 25న విడుదలైన ఈ చిత్రం థియేటర్లో పెద్దగా ఆడలేదు. కానీ ఓటీటీలో మాత్రం మంచి ఆదరణ పొందుతోంది.

ప్రైమ్‌లో మూడో స్థానంలో కూనల్‌ కెమ్ము దర్శకత్వంలో రూపొందిన `వైబ్‌` చిత్రం ట్రెండ్‌ అవుతుంది. ఇందులో ప్రీతి జింటా హీరోయిన్‌గా నటించింది. యాక్షన్‌ థ్రిల్లర్‌ కామెడీ ప్రధానంగా తెరకెక్కిన ఈ మూవీ థియేటర్లో యావరేజ్‌గా ఆడింది. ఓటీటీలో మాత్రం అదరగొడుతుంది.

45
నాల్గో స్థానంలో విశ్వక్‌ సేన్‌ కల్ట్

నాల్గో స్థానంలో తెలుగు సినిమా ఉండటం విశేషం. విశ్వక్‌ సేన్‌ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన మూవీ `కల్ట్`(#Cult). తెలుగులో వచ్చిన తొలి స్లాషర్‌ మూవీ. సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ గత నెలలో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. గత వారమే ప్రైమ్‌ ఓటీటీలోకి వచ్చింది. థియేటర్లో డిజాస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం ఓటీటీలో దుమ్మురేపుతుండటం విశేషం.

ఐదో స్థానంలో `మీర్జాపూర్‌` అనే హిందీ మూవీ, ఆరో స్థానంలో `క్యాంపస్‌ డైరీస్‌ 2` అనే హిందీ వెబ్‌ సిరీస్‌, ఏడో స్థానంలో `లవ్‌ ఇన్‌ డిస్‌గూస్‌` అనే కొరియన్‌ సిరీస్‌ ట్రెండ్‌ అవుతున్నాయి.

55
ప్రైమ్‌లో టాప్‌ 10లో కన్నడ సంచలన చిత్రం

ప్రైమ్‌లో 8వ స్థానంలో కన్నడ చిత్రం `ప్రేమద ఓరలి`(ప్రేమనే ఊరిలో) ఇండియా వైడ్‌గా ట్రెండ్‌ అవుతుంటం విశేషం. ఇది తెలుగులోనూ డబ్‌ అయి విశేష ఆదరణ పొందింది. కన్నడలో చిన్న చిత్రాల్లో పెద్ద విజయం సాధించింది. కేవలం రూ.3కోట్లతో రూపొంది, ఏకంగా రూ.150కోట్లు వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్మురేపుతుండటం విశేషం.

9, 10 స్థానాల్లో `క్లాషింగ్‌ థ్రూ ది స్నో`, `ది రింగ్స్ ఆఫ్‌ పవర్‌` అనే హాలీవుడ్‌ చిత్రాలు ఇండియా టాప్‌ 10 లిస్ట్ లో ట్రెండ్‌ అవుతుండటం విశేషం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories