ఆ ముగ్గురి మధ్య `ప్రేమ దేశం` లవ్‌ స్టోరీ.. అతడు ఉంటే ఆమె సేఫ్‌ లేదంటే ఎలిమినేషనే?

First Published | Sep 16, 2024, 7:58 AM IST

`ప్రేమ దేశం` సినిమా కల్ట్ క్లాసిక్‌. యూత్ ని ఊపేసిన మూవీ. కానీ బిగ్‌ బాస్‌ తెలుగు 8 హౌజ్‌లో `ప్రేమ దేశం` లవ్‌ స్టోరీ నడుస్తుందని రచ్చ చేస్తున్నారు నెటిజన్లు. 
 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 రెండు వారాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది. రెండో వారం శేఖర్‌ బాషా ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు హౌజ్‌లో 12 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. యష్మి, ఆదిత్య ఓం, సోనియా, విష్ణు ప్రియా, అభయ్‌, నబీల్‌, నైనిక, కిర్రాక్‌ సీత, మణికంఠ, ప్రేరణ, పృథ్వీరాజ్‌, నిఖిల్‌ ఉన్నారు. వీరంతా రెండు టీములుగా విడిపోయారు. ప్రస్తుతం హౌజ్‌లో రెండు చీఫ్‌ల వ్యవస్థ ఉంది. అభయ్‌, నిఖిల్‌ చీఫ్‌లుగా ఉన్నారు. చెరో ఐదుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్స్ కోసం ఇక్కడ చూడండి.

ఇవన్నీ పక్కన పెడితే హౌజ్‌లో ఓ ఇంట్రెస్టింగ్‌ స్టోరీ నడుస్తుంది. సోనియా ఆకుల వ్యవహారం చర్చనీయాంశం అవుతుంది. కరెక్ట్ గా బయట పడటం లేదుగానీ, ఆమె ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ నడిపిస్తుంది. అటు పృథ్వీరాజ్‌తో, ఇటు నిఖిల్‌తో క్లోజ్‌గా మూవ్‌ అవుతుంది. ఇంకా చెప్పాలంటే పలు సందర్బాల్లో ఈ ముగ్గురు కలిసి కనిపిస్తున్నారు. దీంతో ఇది సరికొత్త చర్చకు దారితీస్తుంది. 


బిగ్‌ బాస్‌ 8 హౌజ్‌లో ప్రేమ జంటలు పుడితే కంటెంట్‌ వస్తుంది. కంటెస్టెంట్లని ఎంపిక చేసే సమయంలోనే హౌజ్‌మేట్లకి బిగ్‌ బాస్‌ నుంచి దీనికి సంబంధించిన స్పష్టమైన ఆదేశాలు ఉంటాయట. ఎవరితో అయినా ఇలాంటి కెమిస్ట్రీ బిల్డ్ చేసుకుంటే కంటెంట్‌ వస్తుందని, మీరు సేఫ్‌గా ఉంటారనే సూచనలు చేస్తారట.

దాని ప్రకారమే బిగ్‌ బాస్‌ హౌజ్‌లో లవ్‌ స్టోరీస్‌ నడుస్తాయనేది బయట వినిపించే మాట. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. అయితే అందులో భాగంగానే ఇప్పుడు సోనియా అటు పృథ్వీరాజ్‌, ఇటు నిఖిల్‌తో లవ్‌ ట్రాక్‌ బిల్డ్ చేస్తుందని సమాచారం.

సోనియా ఆకుల ఇద్దరితోనూ కెమిస్ట్రీ బిల్డ్ చేసుకునే పనిలో ఉంది. ఆమె గేమ్‌లో వీక్‌గానే ఉంది. పెద్దగా యాక్టివ్‌గా పాల్గొంటున్నట్టు అనిపించడం లేదు. హైలైట్‌ కావడం లేదు. కానీ విమర్శలు చేయడంలో, ఇతర కంటెస్టెంట్ల గురించి గుసగుసలు మాట్లాడటంలో ముందు ఉంటుంది. అది కూడా పృథ్వీ, నిఖిల్‌ వద్దే ఎక్కువగా చెబుతుంది.

అంతేకాదు ఆమె ఇతర అమ్మాయిల కంటే ఈ ఇద్దరి వద్దనే ఎక్కువగా కనిపిస్తుంది. బెడ్‌ పై వీళ్లు చేస్తున్న రొమాన్స్, సెంటిమెంట్లు, సింపతీ గేమ్‌లు చూసిన నెటిజన్లు గట్టిగానే కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు వీరి ప్రేమ కథని సినిమా లెవల్‌లో పోల్చడం విశేషం. 
 

సోనియా, పృథ్వీరాజ్‌, నిఖిల్‌ మధ్య ప్రేమ కథ.. `ప్రేమదేశం` సినిమాతో పోల్చుతున్నారు. ఆ సినిమాలో కూడా అబ్బాస్‌, వినీత్‌లతో టబు లవ్‌ స్టోరీ నడిస్తుంది. ఈఇద్దరు స్నేహితులు. ఒకరు తెలియకుండానే ఒకరు ప్రేమిస్తారు. తర్వాత విషయం తెలిసి ముగ్గురూ ప్రేమించుకుంటారు.

అప్పట్లో ఈ ప్రేమ కథ పెద్ద సంచలనం సృష్టించింది. యువతపై తీవ్ర ప్రభావాన్నిచూపించింది. యూత్‌ని ఓ ఊపు ఊపేసింది. దీనికి అడిక్ట్ అయిపోయిన కుర్రాళ్లు జీవితాలు కూడా పాడు చేసుకున్న సంఘటనలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. 
 

ఈ నేపథ్యంలో ఇప్పుడు `బిగ్‌ బాస్‌ తెలుగు 8 `లో సోనియా, పృథ్వీ, నిఖిల్‌ ల మధ్య నడుస్తున్న దానితో పోల్చుతూ ట్రోల్‌ చేస్తున్నారు నెటిజన్లు. అయితే దీన్ని నెగటివ్ గా ట్రోల్‌ చేయడం గమనార్హం. సోనియా చెప్పింది ఇద్దరు చేస్తున్నారని, ఆమె రూల్‌ పెడితే వీళ్లు ఫాలో అవుతున్నారని, ఆమె వాళ్లని పప్పులుగా మార్చేస్తుందని అంటున్నారు. అక్క రూల్‌ పెడితే అలా ఉంటుందని రచ్చ రచ్చ చేస్తున్నారు. దీంతో ఇప్పుడిది చర్చనీయాంశం అవుతుంది. 
 

అయితే ఇందులో పెద్ద ట్విస్ట్ ఏంటంటే ముందుగా బిగ్‌ బాస్‌ ఊహించింది వేరే. విష్ణు ప్రియా, పృథ్వీరాజ్‌ ఒక జంటగా, నిఖిల్‌, సోనియా మరో జంటగా లవ్‌ ట్రాక్‌ నడిపిస్తారని అనుకున్నారు. కానీ విష్ణు ప్రియా ఆ వైపే ఫోకస్‌ చేయడం లేదు. ఆ విషయంలో ఆమె పెద్దగా యాక్టివ్‌గా కనిపించడం లేదు. దీంతో ఈ ముగ్గురు ఒక్కటైనట్టు తెలుస్తుంది.

సోనియా ఈ ఇద్దరిని ఆప్షన్‌గా పెట్టుకుంది. ఎవరితో వర్కౌట్‌ అయితే వాళ్లతో వెళ్లిపోదామని, కానీ చివరకు అది ట్రయాంగిల్‌ లవ్‌ ట్రాక్‌గా మారినట్టుగా అనిపిస్తుంది. మరి ఇది ఏ తీరం చేరుతుంది, నిజంగానే సోనియా ఆ ట్రాక్‌ నడిపిస్తుందా లేక హౌజ్‌లో ఉండేందుకు స్ట్రాటజీ ప్రకారం వెళ్తుందా? అనేది సస్పెన్స్. 
 

ఇదిలా ఉంటే సోనియా హౌజ్‌లో ఉండాలా? ఎలిమినేట్‌ కావాలా? అనేది ఈ లవ్‌ ట్రాక్‌ ప్రకారమే ఉంది. ఆమె గేమ్‌ల్లో యాక్టివ్‌గా లేదు. విమర్శలు, గొడవల్లోనే యాక్టివ్‌గా ఉంటుంది. పైగా మొదటి వారం ఉన్నంత జోరు కనిపించడం లేదు. ఆ ఇద్దరితో పులిహోర కలపడంతోనే బిజీ అయ్యింది. దీంతో ఆమెకి డేంజర్‌ బెల్స్ మోగుతున్నాయి.

పృథ్వీరాజ్‌, నిఖిల్‌ లతో లవ్‌ ట్రాక్‌ బిల్డ్ అయి కంటెంట్‌ వస్తే ఆమె కొన్ని రోజులు సేఫ్‌గా ఉంటుంది. లేదంటే ఎలిమినేషన్‌ పక్కా అని తెలుస్తుంది. అంతేకాదు పృథ్వీరాజ్‌ ఎలిమినేట్‌ అయినా సోనియా డేంజర్‌ జోన్‌లోకి వెళ్లిపోతుందని, ఆమె ఎలిమినేషన్‌ కూడా త్వరగానే ఉంటుందని తెలుస్తుంది. ఇదంతా బిగ్‌ బాస్ స్ట్రాటజీ అని టాక్‌. ఏం జరుగుతుందో చూడాలి. 
 

Latest Videos

click me!