
కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను మనవాళ్లు బాగానే ఆదరిస్తున్నారు. రీసెంట్ గా ఆయ్, కమిటీ కుర్రాళ్ళు, 35 మూవీస్ సక్సెస్ అందుకు నిదర్శనం. తాజాగా ఆ లిస్ట్ లో చేరింది మరొక చిన్న చిత్రం మత్తు వదలరా 2. శ్రీసింహా, ఫరియా అబ్దుల్లా, సత్య కీలక పాత్రలు చేసిన ఈ సినిమాని యంగ్ డైరక్టర్ రితేష్ రానా తెరకెక్కించారు.
బిగ్ బాస్ తెలుగు 8 అప్ డేట్స్ కోసం ఇక్కడ చూడండి.
క్లాప్ ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించిన ఈ మూవీ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ . మార్నింగ్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం చిరంజీవి, మహేష్ బాబు వంటి సెలబ్రిటీస్ నుండి కూడా ప్రసంశలు అందుకోవటం కలిసొచ్చింది. ఈ శుక్రవారం రిలీజైన మత్తు వదలారా 2 పాటు విడుదలైన మరి కొన్ని చిన్న చిత్రాలు మినిమం ఓపినింగ్స్ కూడా రాబట్టుకోలేకపోయాయి.
మత్తు వదలారా 2 సక్సెస్ గా నిలిచింది. ఈ చిత్రం శని, ఆదివారాల్లో మంచి గ్రోత్ సాధించింది. ఆదివారం మాగ్జిమం హౌస్ ఫుల్స్ అయ్యాయి. మత్తు వదలారా 2 కి మల్టిప్లెక్స్ లలో, A సెంటర్లలో మంచి రన్ కనపడుతోంది. వరల్డ్ వైడ్ గా కూడా మంచి జోరుని చూపెడుతూ దూసుకు పోతున్న ఈ సినిమాకి ఓవర్సీస్ బాగా హెల్ప్ అవుతోంది.
వీకెండ్ లో మాగ్జిమం రికవరీని సొంతం చేసుకున్న ఈ సినిమా వర్కింగ్ డేస్ లో మినిమమ్ హోల్డ్ చేసినా కూడా బ్రేక్ ఈవెన్ ని దాటేసి మంచి లాభాలాను సొంతం చేసుకునే అవకాశం ఉంది. కలెక్షన్స్ విషయానికి వస్తే మత్తు వదలరా 2 మూవీ మొదటి రోజు రూ. 5.3 కోట్లు కొల్లగొట్టగా, మొత్తం రెండు రోజుల్లో రూ. 11 కోట్లు రాబట్టింది.
మరోవైపు యుఎస్ఏ లో అప్పుడే 500 కె డాలర్స్ ని ఈ మూవీ అందుకుంది. మొత్తంగా సూపర్ డూపర్ హిట్ దిశగా కొనసాగుతున్న మత్తు వదలరా 2 మూవీ ఓవరాల్ గా ఎంత రాబడుతుందో చూడాలి.
‘మత్తు వదలరా 2’ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.4 కోట్లు. 2 రోజులకే ఈ సినిమా రూ.4.81 కోట్లు షేర్ ని కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా…. రూ.0.81 కోట్ల లాభాలు అందించింది. మొదటి రోజు కంటే రెండో రోజు ఫుట్-ఫాల్స్ పెరిగాయి. ముఖ్యంగా ఆంధ్రాలో ఈ సినిమా బాగా పికప్ అయ్యింది.
ఈ చిత్రానికి సింహా హీరో అయినా.. సత్య కామెడీనే మెయిన్ హైలెట్ అయింది. ఫరియా, వెన్నెల కిషోర్, సునిల్ ఇలా అందరి పాత్రలకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. సత్య మాత్రం అందరినీ నవ్వించేశాడు. బ్రహ్మానందం, సునిల్ తరువాత ఇక సత్యనే అనేట్టుగా అందరూ మాట్లాడుకుంటున్నారు. సక్సెస్ మీట్లో అందరూ సత్య గురించే గొప్పగా మాట్లాడారు.
2019 చివర్లో వచ్చిన ‘మత్తు వదలరా’ (Mathu Vadalara) చిత్రం మంచి సక్సెస్ అందుకుంది. ఆ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సింహా కోడూరి (Sri Simha) . అయితే ఆ తర్వాత.. ‘మత్తు వదలరా’ రేంజ్ సక్సెస్ అయితే అతను అందుకోలేదు. రితేష్ రానా (Ritesh Rana) డైరెక్ట్ చేసిన ఆ చిత్రంలో సత్య (Satya) కామెడీ హైలెట్ గా నిలిచింది. ఇక దాదాపు 5 ఏళ్ళ తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2) రూపొందింది.