లైంగిక వేధింపుల కేసులో స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్

తనపై అత్యాచారం చేయడంతోపాటు గాయపరిచాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో జానీ మాస్టర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Jani Master

తెలుగులో స్టార్ కొరియోగ్రాఫర్ గా ఎదిగిన జానీ మాస్టర్ ఇప్పుడు తమిళ్, కన్నడ, హిందీ లో కూడా బిజీ అవుతున్నారు.  70వ నేషనల్ అవార్డ్స్ లో జానీ మాస్టర్ కి బెస్ట్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ అవార్డు సైతం ఆయన్ను వరించింది. తెలుగు,తమిళ,కన్నడంలో ఫుల్ డిమాండ్ ఉన్న జానీ మాస్టర్ ఇప్పుడు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 

Jani Master

 జస్టిస్ హేమ కమిటీ నివేదిక బహిర్గతం అయిన తర్వాత అన్ని  చిత్ర సీమలో తీవ్ర ప్రకంపనలు రేగుతున్న విషయం తెలిసిందే. ఫిలిమ్ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మహిళలు ఒక్కొక్కరుగా బయటకు వస్తూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు.

పలువురు హీరోయిన్లు బాధితుల్లో ఉండటం, వారు ఇప్పుడు తమకు ఎదురైన చేదు అనుభవాలను, వేధింపులను ధైర్యంగా వెల్లడిస్తుండటం హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే మళయాళంలో  సిద్దిఖీ, జయసూర్య, దర్శకుడు రంజిత్ పై కేసులు నమోదు కాగా,   హీరో నివిన్ పౌలీపై సైతం  కేసు నమోదయింది. ఇప్పుడు తెలుగులోనూ ఈ ట్రెండ్ మొదలైందనిపిస్తోంది. 


Jani Master

కేసు వివరాల్లోకి వెళితే....   కొరియోగ్రాఫర్ జాని మాస్టర్ గత కొంతకాలంగా తన మీద లైంగిక వేదింపులకు పాల్పడుతున్నట్లు మరో మహిళా కొరియోగ్రాఫర్ (21) పోలీసులకు ఫిర్యాదు చేసింది.  జానీ మాస్టర్ లైంగికంగా వేధిస్తున్నారంటూ ఓ డాన్సర్ రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారం చేయడంతోపాటు గాయపరిచాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Jani Master

ఆ పిర్యాదులో ఆమె చెన్నై, ముంబై, హైదరాబాద్‌తో సహా వివిధ నగరాల్లో అవుట్‌డోర్ చేస్తున్నప్పుడు మరియు నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసి తదుపరి విచారణ చేస్తున్నారు. 

 ఇక సదరు మహిళ నార్సింగి నివాసి అయినందున నార్సింగి పోలీసులకు కేసు బదిలీ చేయగా అతనిపై ఐపిసి సెక్షన్ 376 (రేప్), క్రిమినల్ బెదిరింపు (506) మరియు స్వచ్ఛందంగా గాయపరచడం (323)లోని క్లాజ్ (2) మరియు (ఎన్) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
 

అలాగే జాని మాస్టర్‌కు గతంలో సైతం నేర చరిత్ర కలిగి ఉంది.. 2015లో ఓ కాలేజిలో మహిళపై దాడి కేసులో 2019లో మేడ్చల్‌లోని స్థానిక కోర్టు జానీ మాస్టర్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది.  

టాలెంట్ పరంగా జానీ మాస్టర్ వంక పెట్టలేరు.జానీ మాస్టర్ గతంలో కూడా 67వ నేషనల్ అవార్డుల్లో బెస్ట్ కొరియోగ్రఫీ అవార్డు అందుకున్నారు. అప్పుడు కన్నడ సినిమా యువరత్నలోని సాంగ్ కి అందుకున్నారు. తెలుగు డ్యాన్స్ మాస్టర్ రెండు సార్లు వేరే భాషల్లో నేషనల్ అవార్డు అందుకోవడం గమనార్హం.  

Latest Videos

click me!