అప్పుడు హిమ(hima) ఆనంద్ రావు ని అడగగా నాకు కంఫర్ట్ గా ఉండదు అనడంతో చేసేదేమీ లేక హిమ వెళ్ళి వెనుక వైపు కూర్చుంటుంది. మరొకవైపు నిరుపమ్, ప్రేమ్ ఇద్దరూ కలిసి సౌందర్య ఇంటికి వెళుతూ కారులో సౌర్య గురించి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత ప్రేమ్(pream), సౌర్య గురించి గొప్పగా పొగుడుతూ మాట్లాడడంతో నిరుపమ్ ఆశ్చర్యపోతాడు. మరొకవైపు శోభ బ్యాంకు వాళ్ళ గురించి,నిరుపమ్ గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది.