అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న తాజా చిత్రం 'థాంక్యూ'. 'మనం' ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న తాజా చిత్రం 'థాంక్యూ'. 'మనం' ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. చైతు మూడు షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.
26
ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమాలకు పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. కంటెంట్ ఎక్స్టార్డినరీగా ఉంటే తప్ప థియేటర్స్ లో సినిమాలకు ఆదరణ లభించడం లేదు. యావరేజ్ సినిమాలు కూడా కంప్లీట్ గా బాక్సాఫీస్ వద్ద డీలా పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో 'థాంక్యూ' మూవీ ఎలా రాణిస్తుందో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
36
నాగ చైతన్య తన వంతుగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో నాగ చైతన్య తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కొత్త దర్శకులతో నాగ చైతన్య ఇప్పుడు పనిచేయడం లేదు అనే ప్రశ్న వచ్చింది. దీనికి చైతు ఆసక్తికరంగా బదులిచ్చాడు.
46
నేను కమర్షియల్ చిత్రాలకు సూట్ అవుతానా అనే డౌట్ ఉంటుంది. ప్రేక్షకులు ఎక్కువగా నన్ను లవ్ స్టోరీస్, ఎమోషనల్ కథల్లో ఆదరించారు. గతంలో నేను దర్శకులని ఎక్కువగా నమ్మేవాడిని. వాళ్ళు ఎంత బాగా చెబితే అంత బాగా నటించేవాడిని. కొత్త దర్శకులతో చేసిన కొన్ని చిత్రాలు చేదు అనుభవాలుగా మిగిలిపోయాయి. వాళ్ళది తప్పు కాదు. నా సెలక్షన్ రాంగ్ ఐ ఉండొచ్చు అని నాగ చైతన్య అన్నారు.
56
థాంక్యూ విషయానికి వస్తే ఇలాంటి కథ దొరకడం కష్టం. మూడు షేడ్స్ లో నటించాను. ఈ మూవీ నాకొక ఛాలెంజ్ లాంటిది. అందుకే ఈ చిత్రం ప్రత్యేకం అని నాగ చైతన్య తెలిపారు.
66
నాగ చైతన్య కెరీర్ లో 100 పర్సెంట్ లవ్, ఏమాయ చేశావే, లవ్ స్టోరీ లాంటి ప్రేమ కథలు విజయం సాధించాయి. చైతన్యకి మాస్ చిత్రాలు అంతగా కలసి రాలేదు. థాంక్యూ చిత్రంలో నాగ చైతన్యకి జోడిగా రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది.