ఈరోజు ఎపిసోడ్ లో సామ్రాట్ అక్కడ నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు తులసి బాధతో నడుచుకుంటూ వెళుతూ ఉండగా ప్రేమ్ తులసిని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు. అప్పుడు సామ్రాట్ కార్లో వెళ్తూ ఒకచోట కారు ఆపి జరిగిన విషయాల గురించి తలచుకొని ఎమోషనల్ అవుతూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మరొకవైపు తులసి సామ్రాట్ నందు తో అన్న మాటలను తలచుకుని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి ప్రేమ్ వస్తాడు. ఇప్పుడు ప్రేమ్ అమ్మ సామ్రాట్ గారు మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు అని అంటాడు.