Itinti Gruhalakshmi: లాస్య షాకింగ్ ప్లాన్.. తులసిని ఇంటి నుంచి తరిమెసిన నందు!

Navya G   | Asianet News
Published : Mar 26, 2022, 10:34 AM IST

Itinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Itinti Gruhalakshmi) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. పైగా కుటుంబం మీద బాధ్యత అనే నేపథ్యంలో కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

PREV
16
Itinti Gruhalakshmi: లాస్య షాకింగ్ ప్లాన్.. తులసిని ఇంటి నుంచి తరిమెసిన నందు!

ప్రేమ్ దంపతులతో సహా దివ్య (Divya) హోలీ వేడుకల్లో పాల్గొని ఎంతో ఆనందం పొందుతారు. ఈ లోపు అక్కడికి తులసి రాగా మరింత ఆనందం వ్యక్తం చేస్తారు. ఇక ప్రేమ్ వాళ్ళ అమ్మకి రంగు పూస్తూ ఉండగా తులసి (Tulasi)  కోపంతో రంగు పాత్రను చేత్తో పక్కకు నెట్టేస్తుంది.
 

26

దాంతో ఫ్యామిలీ మొత్తం ఒక్కసారి గా స్టన్ అవుతారు. ఇక క్రమంలో తులసి (Tulasi) మీరు అందరూ ఒకటే అని నాకు అర్థం అయిపోయింది అని అంటుంది. అంతేకాకుండా నేనొక్కదాన్నే పరాయి దాన్ని అని నాకు అర్థం అయిపోయింది అని భాదగా అంటుంది. అదే క్రమంలో అమ్మ కొంగు పట్టుకొని పెరగడం కాకుండా నలుగురు మెచ్చుకునేలా ఎదగాలి అని ప్రేమ్ (Prem) ను అంటుంది.
 

36

ఇక తులసి (Tulasi) అమ్మ వద్దన్నందుకు కన్నీళ్లు పెట్టుకోవడం కాదు రా.. అనుకున్నది సాధించ లేనందుకు కన్నీళ్లు పెట్టుకోవాలి అని విరుచుకు పడుతుంది. అదే క్రమంలో తులసి ప్రేమ్ (Prem) పై ఉన్న ప్రేమను తెలిపి ఇన్నాళ్లు తన మనసులో ఉన్న బాధ ఏంటో ఇండైరెక్ట్ గా తెలిసేలా చేస్తుంది.
 

46

దాంతో ఒక్కసారిగా ప్రేమ్ (Prem) అక్కడికక్కడే కుప్పకూలిపోయి బాధపడుతూ ఏడుస్తాడు. ఇక ఆ తర్వాత  ప్రేమ్ వాళ్ళ అత్తయ్య ప్రేమ్ ను ఇలా మందలించినందుకు తులసి (Tulasi) పై కోపం పడుతుంది. అంతే కాకుండా ప్రేమ్ ను ఇంటికి తీసుకొని వెళ్దాం అని అంటుంది.
 

56

ఇక తర్వాత నందు (Nandhu) మేము ఇల్లు వదిలి వెళుతున్నాము అని అంటాడు. అంతే కాకుండా అదే క్రమంలో లాస్య (Lasya) మాకు ఈ ఇంటిలో ఎలాంటి మర్యాద లేకుండా పోయింది అని అంటుంది. ఇక నందు వాళ్ళ అమ్మానాన్న ను తనవెంట రమ్మని అంటాడు. కానీ  వాళ్ల వాళ్ల అమ్మ నాన్న మీ వెంట రాలేము అని చెప్పేస్తారు.
 

66

ఆ తర్వాత నందు (Nandhu) తులసిని నువ్వు మా అమ్మ నాన్న లను నా నుంచి దూరం చేయాలనుకుంటున్నావా అని విరుచుకు పడతాడు. ఇక ఆ మాటతో తులసి (Tulasi) ఇంటిలోనుంచి బయటికి వెళ్లడానికి సిద్ధమవుంటుంది. ఇక ఈ క్రమంలో అత్తమామలు చాలా బాధ పడతారు. ఇక రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.

click me!

Recommended Stories