RRR Heroes: ఆర్ఆర్ఆర్ విజయం వెనుక కనిపించే హీరోలు ఎన్టీఆర్, చరణ్ అయితే, కనిపించని హీరోలు వీళ్లే

Published : Mar 26, 2022, 10:33 AM IST

మూడు సంవత్సరాల ఫ్యాన్స్ నిరీక్షణకు తెరదించుతూ..ఎట్టకేలకు ట్రిపుల్ ఆర్ మూవీ రిలీజ్ అయ్యింది. భారీ విజయం లక్ష్యంగా దూసుకుపోతున్న ట్రిపుల్ ఆర్ విషయంలో తెరముందు హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ అయితే.. తెర వెనుక హీరోలు చాలామంది ఉన్నారు. 

PREV
110
RRR Heroes: ఆర్ఆర్ఆర్ విజయం వెనుక కనిపించే హీరోలు ఎన్టీఆర్, చరణ్ అయితే, కనిపించని హీరోలు వీళ్లే

ఆర్ఆర్ఆర్ సినిమాపై ఎన్టీఆర్ యాక్టింగ్.. రామ్ చరణ్ యాక్షన్.. ఆలియా బ్యూటీ.. ఇవే కనిపిస్తున్నాయి. కాని తెర వెనక అసలు హీరోయిజం చూపించనవారు చాలా మంది ఉన్నారు. రైటర్ విజయేంద్ర ప్రసాద్, డైరెక్టర్ రాజమౌళి నుంచి.. సెట్ డిజైనర్ వరకూ చాల మంది మూడేళ్ళ కష్టం ఈసినిమా. మరి వాళ్ళ గురించి ఒక్కసారి చూసుకుంటే.. 
 

210

రాజమౌళి సినిమా అంటే ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ ఉండాల్సిందే. స్టూడెండ్ నెంబర్ వన్, మర్యాద రామన్న, ఈగా మినహాయిస్తే.. రాజమౌళి సినిమాలన్నీంటికి ఆయన తండ్రే కథ రాశారు. ఇక ట్రిపుల్ ఆర్ కూడా అంతే. విజయేంద్ర ప్రసాద్ చెప్పిన లైన్ నచ్చడంతో కథ సిద్థం చేయమన్నారట జక్కన్న. తను స్క్రీన్ ప్లే అందించడంతో ట్రిపుల్ ఆర్ లాంటి అద్భుతాన్ని సృస్టించారు.

310

ఇక ట్రిపుల్ ఆర్ కు సృస్టికర్త, ఈ అద్భుతాన్ని చెక్కిన జక్కన్న రాజమౌళి కూడా ట్రిపుల్ ఆర్ హీరోనే. పర్ఫెక్షన్ కోసం సెకన్ టూ సెకన్ ఫ్రేమ్ ను కూడా గమనిస్తూ.. సినిమాను అద్భుతంగా రూపందించాడు రాజమౌళి.  కథ ఒకే అయిన దగ్గర నుంచి బొమ్మ తెరపై పడే వరకూ కెప్టెన్ గా జక్కన్న తన బాధ్యతలను పర్ఫెక్ట్ గా నిర్వహిస్తాడు. అందుకే ఆయన ఓటమెరుగని దర్శకధీరుడుగా పేరుగాంచాడు. ప్రపంచం మెచ్చిన దర్శకుడయ్యాడు. 

410

ఆర్ఆర్ఆర్ అనే బొమ్మనురాజమౌళీ అందంగా తయారు చేస్తే.. దానికి తన సంగీతంతో ప్రాణం పోశాడు కీరవాణి. జక్కన్న ప్రతీ సినిమాకు ఆయన సోదరుడు కీరవాణినే సంగీతం అందిస్తుంటాడు. ప్రతీ సినిమాకు దానికి తగ్గట్టు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు పాటలు కూడా సినిమాకు తగ్గట్టు సంగీతం అందిస్తూ.. విజయానికి  తెరవెనుకు హీరోలలో ఒకడిగా నిలిచిపోయారు కీరవాణి. 

510

రాజమౌళి బుర్రలో ఉన్న సన్నివేశాన్ని తన కెమెరా కళ్లతో చూస్తుడ సినిమాటోగ్రఫర్ సెంథిల్ కుమార్. సై సినమా నుంచి వీరి బంధం కొనసాగుతుంది. ప్రతీ సినిమాను తన అద్భుతమైన ఆలోచనలతో.. కెమెరా పనితనంతో తీర్చిదిద్దే సెంథిల్.. ట్రిపుల్ ఆర్ ను కూడా అదే విజన్ తో పనిచేశాడు. ఎప్పటికప్పుడు ఎదురైన సవాళ్ళను ఎదుర్కొంటూ.. సినిమాను రిలీజ్ వరకూ తీసుకువచ్చారు. 

610

సినిమా కోసం ఎంత మంది కష్టపడ్డా.. బ్యాక్ గ్రౌండ్ లో ఆ సినిమాకు తగ్గట్టు.. ఆ సీన్ కు తగ్గట్టు వెనుకు సెట్స్ కూడా ఉండాలి. మరి ఉండాలి అంటే అందలో జీవం ఉట్టిపడేలా పర్ఫెక్ట్ సెట్ డిజైనర్ ఉండాలి.. అటువంటి వారిలో సాబు సిరిల్ ముందు వరకసలో ఉంటారు. పీరియాడికల్ మూవీ అంటే సెట్స్ విషయంలో ఎంత రీసెర్చ్ చేయాలో అంతా చేసి.. సినిమాకు తన సెట్స్ తో జీవకళ వచ్చేలా చేశారాయన. 
 

710

సినిమాకు దర్శకుడు,రచయిత ఎంత ముఖ్యమో.. ఎడిటర్ కూడా అంతే ముఖ్యం. దర్శకుడు ఆడియన్స్ కు చాలా చెప్పాలి అనుకుంటాడు. కాని ఉన్న టైమ్ లో అంతా చెప్పే అవకాశం ఉండదు. కాని ఎడిటర్ దర్శకుడి విజన్ కు తగ్గట్టు పక్కా పాయింట్ ను ప్రేక్షకుడికి చేరేలా చేస్తాడు.  ట్రిపుల్ ఆర్ కూడా అలాంటి ఎడిటరే పనిచేశాడు. ఆయనే శ్రీకర్ ప్రసాద్. రాజమౌళి మనసు తెలిసిన ఎడిటర్ ఆయన. 

810

ఇక రాజమౌళిప్రతీ సినిమాకు వెన్నంటే ఉండే వారిలో రాజమౌళి భార్య రమ, కీరవాణి భార్య వల్లి, జక్కన్న తనయుడు కార్తికేయ. వీరంతా తమతమ బాధత్యలను పర్ఫెక్ట్ గా తీసుకోబట్టే ప్రతీ సినిమా ఒక కళాఖండం అవుతున్నాయి. కాస్ట్యూమ్స్, జువ్వెలరీ విషయంలో రమా రాజమౌళి, ప్రొడక్షన్ పనులు శ్రీవల్లి, ఆర్టిస్ట్ లు,పేమెంట్లు, ఇతర పనులు కార్తికేయ తీసుకుని సినిమాను వెన్నంటి నడిపించారు.. విజయంలో భాగస్వామ్యులయ్యారు. 
 

910

ఇక సినిమాకు కెప్టెన్ డైరెక్టర్ అయితే.. ఆకెప్టెన్ న్ ను కూడా వెన్నంటి నడించేవాడు నిర్మాత. ట్రిపుల్ ఆర్ విషయంలో దాదాపు 5 వందల కోట్లు బడ్జెట్ పెట్టడమే కాదు.. కరోనాతో సంక్షోబంలో పడ్డప్పుడు., సినిమా రెండు సార్లు వాయిదా పడ్డప్పుడు మొక్క వోని దీక్షతో.. రాజమౌళి మీద నమ్మకంతో.. తాను దైర్యంగా ఉంటూ.. నిర్మాత దానయ్య.. ట్రిపుల్ ఆర్ బ్యాక్ గ్రౌండ్ రియల్  హీరో అనిపించుకున్నారు. 

1010

వీళే కాదు ట్రిపుల్ ఆర్ లో పేలిన మాటల తూటాలు అందించిన బుర్రా సాయిమాధవ్ తో పాటు, పాటల రచయితలు, గాయనీ గాయకులు, సినిమాకోసం కష్టపడ్డ ప్రతీ ఓక్కరు తెరవెనుకు హీరోలే. సినమా మొదలు అయినప్పటి నుంచీ.. బోమ్మ పడే వరకూ నిర్విరామంగా కృషి చేసిన వారు ట్రిపుల్ ఆర్ సక్సెస్ లో భాగం అయ్యారు. రియల్ హీరోలు అనిపించుకున్నారు.
 

click me!

Recommended Stories