ఎపిసోడ్ ప్రారంభంలోనే..... నిరూపమ్ సౌర్యని,ఎత్తుకొని ఇంటికి వస్తాడు.సౌందర్య,ప్రేమ్ ఏమైంది?అని కంగారుగా అడుగుతారు.అప్పుడు హిమా జరిగినదంతా చెబుతాది. నిరుపమ్ సౌర్యని,సోఫా మీద పడుకోబెట్టి,అందర్నీ "కంగారు పడొద్దు నీరసం వల్ల పడిపోయింది"అని చెబుతాడు.ఈ లోగ శౌర్య కళ్ళు తెరుస్తాది. అప్పటికే వంటి నొప్పితో నిరూపమ్ సోఫా మీద కూర్చుంటాడు. నిన్ను అక్కడి నుంచి మోసి అలసిపోయాడు అని సౌందర్య అనగా, శౌర్య "బాధ్యత ఉంటే బరువు అనిపించదు,తిట్టుకొని మోయడం ఎందుకు?" అని చెప్పి గదిలోకి వెళ్ళిపోతుంది.