సింపుల్ గా పెళ్లి చేసుకున్న త్రిగుణ్..
తల్లి మరణించిన కొద్దికాలానికే అంత ఆర్భాటంగా పెళ్లి చేసుకోవడం సరైన సమయం కాదని ఆయన భావించారు. అయితే, ఇంట్లో త్వరగా ఒక శుభకార్యం జరగడం మంచిదని తండ్రితో పాటు కుటుంబ సభ్యులు సూచించారు. గ్రాండ్ గా చేయాల్సిన వేడుకలను రద్దు చేసుకుని, బంధువులు, సన్నిహితులను కూడా పిలవకుండా అత్యంత నిరాడంబరంగా పెళ్లి పూర్తి చేశారు. ఇదే విషయంపై కొండా మురళి వంటి రాజకీయ ప్రముఖులు కూడా ఎందుకు పిలవలేదని అడిగినప్పుడు, తల్లి మరణించిన విషయాన్ని తెలిపానని త్రిగుణ్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
భార్య నివేదిత ఏం చేస్తుంది? ఎలా పరిచయం
తన భార్య నివేదిత ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తున్నారని, ఆమె తమ బంధువుల అమ్మాయేనని త్రిగుణ్ తెలిపారు. ఇల్లు నిర్మించే క్రమంలో సహాయం చేయడానికి వచ్చిన నివేదితను ఆయన తల్లి పరిచయం చేశారని, ఆ పరిచయం ప్రేమగా మారి వివాహానికి దారితీసిందని వివరించారు. ఈ విధంగా, తన వివాహం సీక్రెట్‌గా జరగడానికి కారణం ఏ విధమైన రహస్యాలు కాదని, కేవలం తల్లి మరణం వల్ల ఏర్పడిన విషాద పరిస్థితులేనని త్రిగుణ్ స్పష్టం చేశారు