ఈరోజు ఎపిసోడ్ లో తులసి, సామ్రాట్ ఇద్దరూ కలిసి గుడికి వెళ్తారు. అప్పుడు తులసి సామ్రాట్ ఇద్దరూ గుడిలో నడుచుకుంటూ వెళుతుండగా ఈ గుడి గురించి మీకు ఎవరు చెప్పారు అనడంతో మన ఆఫీస్ వాళ్ళు చెప్పారు అని అంటాడు. మన మూర్తి గారి అమ్మాయికి ఈ గుడిలో ముడుపు కట్టింటే పెళ్లయింది అని అనగా మిమ్మల్ని కూడా ముడుపు కట్టమని చెప్పారా అని తులసి నవ్వుతూ అనగా సామ్రాట్ కూడా నవ్వుతూ ఉంటాడు. ఇప్పుడు సామ్రాట్ ఈ గుడిలో అమ్మవారిని మొక్కుకొని పేపర్ పై మన కోరికను రాసి ముడుపు కడితే తప్పకుండా నెరవేడుతుందట అని అనడంతో తులసి కూడా ఆలోచిస్తూ ఉంటుంది.