రాధికతో పెళ్లి.. విడాకులు.. ప్రతాప్ పోతెన్ ఫ్యామిలీ లైఫ్ గురించి షాకింగ్ నిజాలు

Published : Jul 15, 2022, 11:26 AM ISTUpdated : Jul 15, 2022, 11:33 AM IST

వరుస విషాదాలు సినీ పరిశ్రమను ముంచెత్తుతున్న వేళ.. తాజాగా మరో విషాదం ఇండస్ట్రీలో చోటు చేసుకుంది. సీనియర్ నటుడు, ఆకలి రాజ్యం ఫేమ్, సీనియర్ హీరోయిన్ రాధిక మాజీ భర్త ప్రాతాప్ పోతేన్ కన్ను మూశారు. రెండు పెళ్ళిలు చేసుకున్నా.. చివరకు ఆయన ఒంటరిగానే జీవిస్తూ.. తిరిగిరాని లోకాలకు చేరిపోయారు.   

PREV
17
రాధికతో పెళ్లి.. విడాకులు.. ప్రతాప్ పోతెన్ ఫ్యామిలీ లైఫ్ గురించి షాకింగ్ నిజాలు

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు ప్రతాప్ పోతెన్ కన్ను మూశారు.  సీనియర్‌ హీరోయిన్ నటి రాధిక మాజీ భర్త ప్రతాప్‌ పోతెన్‌. ఆయన వయస్సు ప్రస్తుతం 70 ఏళ్ళు.  చెన్నైలోని తన నివాసంలో శుక్రవారం ఉదయం ఆయన విగత జీవిగా కనిపించారు. 
 

27

ప్రతాప్ పోతెన్ మరణ వార్త తెలిసి తెలుగు, తమిళ పరిశ్రమ షాక్ కుగురయ్యింది.  ప్రతాప్ పోతెన్ మలయాళ నటుడే అయినా.. సౌత్ లోని అన్ని భాషల్లో ఆయన సినిమాలు చేశారు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఆయన ఎన్నో సినిమాల్లో చేశారు. తెలుగులో ప్రతాప్ ఆకలి రాజ్యం, కాంచనగంగ, మరో చరిత్ర, వీడెవడు లాంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. 
 

37

ప్రతాప్‌ పోతెన్‌ మల్టీ టాలెంటెడ్. ఆయన ఒక నటనకు మాత్రమే పరిమితం కాలేదు. నటుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయినా.. ఆతరువాత నిర్మాతగా, డైరెక్టర్ గా మారి సినిమాలు చేశారు.   చాలా సినిమాలకు రచనా సహకారం కూడా ఇచ్చారు ప్రతాప్ పోతెన్
 

47

సీనియర్‌ హీరోయిన్.. ప్రముఖ  నటి రాధిక మొదటి భర్త  ప్రతాప్. ఈయన రాధికను  1985లో  పెళ్లి చేసుకున్నారు. అయితే విరి బంధం ఎక్కువ కాలం నిలవలేదు. పెళ్ళైన ఏడాదికే అంటే 1986 లో వీరిద్దరు  విడాకులు తీసుకుని విడిపోయారు. 

57

రాధికాతో విడాకులు తరువాత ప్రతాప్ పోతెన్ నాలుగేళ్ళు ఒంటరిగానే ఉన్నారు. ఆతరువాత ఆయన అమల సత్యనాథన్ ను  1990 లో పెళ్ళి చేసుకున్నారు. వీరికి ఒక కూమార్తె ఉంది. అమల సత్యనాథన్ కు కూడా 2012 లో విడాకులు ఇచ్చారు ప్రతాప్. ప్రస్తుతం వరకూ ఆయన చెన్నైలో ఒంటరిగానే జీవిస్తున్నారు. 

67

గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ఫ్యామిలీ లైఫ్ గురించి కొన్ని విషయాలు తెలిపారు ప్రతాప్. రాధికాతో విడాకులు అవ్వడానికి ప్రత్యేక కారణాలు ఏమీ లేవన్నారు. రాధిక మంచి వ్యక్తి అని కితాబిచ్చారు. ఇద్దరు ఒక అండస్ట్రాండింగ్ కు వచ్చిన తరువాతే విడాకులు తీసుకున్నామన్నారు అప్పట్లో ప్రతాప్. 
 

77

వివాహం అనేది అందరి జివితానికి సరిపడేది కాదన్నారు ప్రతాప్. అది ఇద్దరి ఆలోచనలను బట్టి ఉంటుందని గతంలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. బ్రతికినంత కాలం.. ఫ్యామిలీకన్నా.. సినిమా కోసమే ఆలోచించారు ప్రతాప్ పోతెన్. రెండు పెళ్ళిళ్ల తరువాత  కూడా ఆయన ఓంటరి జీవితంలోనే మరణించారు. 

click me!

Recommended Stories