దాదాపు 2 వేల మంది జూనియర్ ఆర్టిస్టుల నేపథ్యంలో ప్రశాంత్ నీల్ భారీ సన్నివేశాలని ప్రారంభించారు. ఎన్టీఆర్ షూటింగ్ లో జాయిన్ కావడానికి ఇంకా టైం పడుతుంది. ఈ చిత్ర కథ గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల నేపథ్యంలో ఎన్టీఆర్, నీల్ చిత్రం ఉండబోతోంది అని అంటున్నారు. నల్లమందు, అంశాలతో పీరియాడిక్ నేపథ్యంలో నీల్ భారీ యాక్షన్ కథని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.