ఇదిలా ఉంటే ఈ మూవీ హిట్ పక్కా అనే వాదన తెరపైకి వచ్చింది. సెంటిమెంట్ ప్రకారం ఈ మూవీ హిట్ గ్యారంటీ అంటున్నారు. తారక్ ఫ్యాన్స్ రిలాక్స్ అవుతుంది. గత చరిత్రని ముందు వేసుకుని బ్లాక బస్టర్ లోడింగ్ అంటున్నారు. మరి హిట్ కి కారణమేంటి? ఆ సెంటిమెంట్ ఏంటి? అనేది చూస్తే,
ఈ సినిమా బెంగాల్ బ్యాక్ డ్రాప్ సాగే కథ. కోల్ కత్తా నేపథ్యంలో వచ్చిన తెలుగు సినిమాలన్నీ విజయం సాధించాయి. చిరంజీవి `చూడాలని ఉంది`, వెంకటేష్ `లక్ష్మి`, రవితేజ `పవర్`, రామ్ చరణ్ `నాయక్` మూవీస్ అన్నీ విజయాలు సాధించాయి.
ఈ నేపథ్యంలో ఇప్పుడు అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని, తారక్ ఫ్యాన్స్ అంటున్నారు.మరి నిజంగానే అది సాధ్యమవుతుందా? ఆ సెంటిమెంట్ పనిచేస్తుంద? అనేది చూడాలి. ఎందుకంటే ఇటీవల వచ్చిన `భోళా శంకర్`, `పడి పడి లేచే మనసు` చిత్రాలు కూడా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్‌లోనే వచ్చాయి. కానీ డిజాస్టర్ అయ్యాయి.