అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా టాలీవుడ్ కమెడియన్ కామెంట్స్ ? పూర్తిగా మాటెందుకు మార్చేశాడో తెలుసా.. 

First Published | Dec 23, 2024, 7:15 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తీవ్రమైన వివాదాన్ని ఎదుర్కొంటున్నారు. సంధ్య థియేటర్ సంఘటనని తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీనితో సంధ్య థియేటర్ సంఘటన రోజుకొక మలుపు తిరుగుతోంది. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తీవ్రమైన వివాదాన్ని ఎదుర్కొంటున్నారు. సంధ్య థియేటర్ సంఘటనని తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీనితో సంధ్య థియేటర్ సంఘటన రోజుకొక మలుపు తిరుగుతోంది. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కొడుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సంధ్య థియేటర్ వద్దకి అల్లు అర్జున్ అనుమతి లేకుండా వెళ్లారని, అందువల్లే తొక్కిసలాట జరిగి మహిళ మృతి చెందింది అంటూ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. 

అప్పటి నుంచి ఈ వివాదం జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది. అల్లు అర్జున్ బెయిల్ పై విడులయ్యాక ఇండస్ట్రీ ప్రముఖులంతా క్యూ కట్టారు. అల్లు అర్జున్ ని పరామర్శించారు. ఆ తర్వాత ఈ కేసు మరో మలుపు తిరిగింది. స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అల్లు అర్జున్ ని విమర్శిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తొక్కిసలాట జరిగింది ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని పోలీసులు కోరినా బన్నీ వెళ్ళలేదు అంటూ రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్ కి కాలు చేయి విరిగిందా ? ఎందుకు సినీ ప్రముఖులు వెళ్లి పరామర్శించారు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 


అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సందర్భంలో అతడికి ఇండస్ట్రీ నుంచి ఫుల్ సపోర్ట్ లభించింది. కానీ మ్యాటర్ ఇప్పుడు సీరియస్ కావడంతో అంత సైలెంట్ అయిపోయారు. బన్నీ వల్ల థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది అంటూ పోలీసులు కూడా సిసి టివి ఫుటేజ్ రిలీజ్ చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన టైంలో కమెడియన్ రాహుల్ రామకృష్ణ మద్దతు తెలిపాడు. పోలీస్ వ్యవస్థపై రాహుల్ పరోక్షంగా విమర్శలు చేసాడు. 

అన్ని వ్యవస్థల ఫెయిల్యూర్ ని ఒక్కరి మీద నెట్టివేయడం కరెక్ట్ కాదు. ఎలాంటి సంఘటన జరిగినా చిత్ర పరిశ్రమ సాఫ్ట్ టార్గెట్ గా మారుతుంది. చిత్ర పరిశ్రమని బ్లేమ్ చేయడం సులభం. ప్రతి ఏడాది ఉత్సవాల్లో, మతపరమైన కార్యక్రమాల్లో, పొలిటికల్ ర్యాలీల్లో తొక్కిసలాట జరిగి వందలాది మంది చనిపోతున్నారు. కానీ వాటిని ఎవరూ పట్టించుకోరు. చిత్ర పరిశ్రమలో ఇలాంటివి జరిగితే మాత్రం ఈజీగా టార్గెట్ చేస్తారు అంటూ రాహుల్ రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ మహిళ కుటుంబానికి జరిగింది తీర్చలేని కష్టమే. కానీ ఈ సంఘటనలో కేవలం ఒక్క వ్యక్తిని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు అంటూ రాహుల్ ట్వీట్ చేశాడు. ఇదంతా అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు చేసిన కామెంట్స్. 

ఇప్పుడు నేరుగా సీఎం ఈ సంఘటనని సీరియస్ గా తీసుకోవడంతో మ్యాటర్ వేడెక్కింది. దీనితో రాహుల్ రామకృష్ణ సడెన్ గా మాట మార్చేసారు. ఈ సంఘటనలో జరిగిన పరిణామాల గురించి నాకు ఎలాంటి అవగాహన లేదు. అందుకే గతంలో అలాంటి వ్యాఖ్యలు చేశాను. ఇప్పుడు నేను నా కామెంట్స్ ని వెనక్కి తీసుకుంటున్నా అంటూ రాహుల్ రామకృష్ణ అల్లు అర్జున్ కి తన మద్దతుని ఉపసంహరించుకున్నారు. 

Latest Videos

click me!