Prasad Behara: ప్రసాద్ బెహరా తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను, నమ్మకద్రోహాన్ని తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. పనిమనిషి మోసం, వ్యక్తిగత అనుభవాలు తనను ఎలా మార్చేశాయో, డబ్బును ఎలా ఖర్చు చేయాలో నేర్పించాయని పేర్కొన్నాడు.
యూట్యూబ్ స్టార్ ప్రసాద్ బెహరా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను ఎదురుకున్న కష్టాలను చెప్పాడు. తన జీవితంలో ఎదురైన పలు సంఘటనలను వివరించాడు. ఒకప్పుడు తాను మానవ సంబంధాలకు అత్యంత విలువనిచ్చి, ఇతరులను త్వరగా నమ్మే వ్యక్తిగా ఉన్నానని.. కానీ జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనలు తన దృక్పథాన్ని పూర్తిగా మార్చేశాయని అతడు తెలిపాడు. ముఖ్యంగా, తన ఇంట్లో పనిచేసిన ఒక మహిళ గురించి అతడు ఇలా చెప్పాడు.
25
విడాకుల తర్వాత ఒంటరితనం
తన విడాకుల తర్వాత ఒంటరితనాన్ని అనుభవిస్తున్న సమయంలో ఆ మహిళను ఇంట్లో పనికి పెట్టుకున్నానని ప్రసాద్ బెహరా తెలిపాడు. ఆమె అడిగిన రూ. 3 వేలకు బదులుగా రూ. 6 వేల జీతాన్ని ఇచ్చానన్నారు. అంతేకాకుండా ప్రతి వారం ఒక కిలో మటన్, ఆమె కుటుంబంలోని నలుగురికీ సినిమా టిక్కెట్లు, నెలవారీగా బియ్యం, ఇతర సరుకులు కొనిచ్చానని చెప్పాడు. ఇవి కాకుండా ఆమెకు పని తక్కువ ఇచ్చి.. కబుర్లు చెబుతూ ఆమె కుటుంబానికి తోడుగా ఉన్నానని ప్రసాద్ బెహరా పేర్కొన్నాడు. ఎవరూ లేరని ఒంటరిగా ఫీల్ అవుతున్న తాను.. ఆమె చెప్పే సోదంతా వింటూ ఉండేవాడినని తెలిపాడు.
35
పనిమనిషి చేతుల్లో మోసపోయా
ఇంత ఉదారంగా వ్యవహరించినప్పటికీ, ఆ మహిళ తన నమ్మకాన్ని వమ్ము చేసిందని ప్రసాద్ బెహరా బాధను వ్యక్తం చేశాడు. తన నాలుగు విలువైన వాచీలను.. వాటిలో ఒకటి రూ. 90 వేల ఆపిల్ వాచ్ కాగా.. వాటిని ఆమె దొంగిలించిందని చెప్పాడు. చిన్న తప్పిదం వల్ల ఆమె ఈ దొంగతనం అంశంలో దొరికిపోయిందని.. ఆ వాచీలను కేవలం 400 రూపాయలకు ఆమె అమ్మేసిందని తెలిసి తీవ్ర ఆవేదనకు గురయ్యానని తెలిపాడు. ఇలా దొంగతనం చేసినందుకు ఆ మహిళలో ఎలాంటి పశ్చాత్తాపం లేకపోవడం.. తన కుటుంబ సభ్యులు తిరిగి ఆమెను పనిలోకి తీసుకోవాలని కోరినా.. ఆమెను తీసుకోలేదని ప్రసాద్ బెహరా తెలిపాడు.
ఈ సంఘటనతో పాటు, జీవితంలో ఎదురైన మరికొన్ని చేదు అనుభవాల వల్ల మనుషులపై నమ్మకం కోల్పోయానని ప్రసాద్ బెహరా వివరించాడు. ఒకప్పుడు ఎవరైనా ఆకలిగా ఉన్నట్లయితే.. వెంటనే అతడిని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించేవాడినని.. ఆ తర్వాత వాళ్లతోనే దెబ్బలు తగిలించుకున్నానని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు ఎవరైనా ప్రేమగా పలకరించినా నమ్మలేకపోతున్నానని తెలిపాడు.
55
నచ్చిన రీతిలో ఖర్చు చేస్తా
ఇక పొదుపు విషయంలో తాను ఇన్సూరెన్స్ తప్పితే.. పెద్దగా ఏ పొదుపు చేయట్లేదని తెలిపాడు. నచ్చినవి కొనుక్కోవడానికి వెనుకాడనని.. షాపులకు వెళ్లకుండా జెప్టో వంటి యాప్‌ల ద్వారా ఆర్డర్ చేసుకుంటూ తనకు నచ్చిన రీతిలో ఖర్చు చేస్తానని చెప్పాడు. తనకు ఒక చెల్లి ఉందని.. ఆమె భర్త లెక్చరర్‌గా పనిచేస్తున్నారని.. వారికి పెద్దగా ఆర్థిక సమస్యలు లేవని ప్రసాద్ బెహరా తెలిపాడు. తనకున్న సమస్యలను, ఒత్తిళ్లను నవ్వుతూ ఎదుర్కొంటున్నానని, హాస్యం తన జీవితంలో ఒక భాగమని అతడు తెలిపాడు.