Jabardasth Chanti : కళ్ళ ముందే తల్లి మరణం, నమ్మిన వారి చేతిలో మోసం, చలాకీ చంటి జీవితంలో ఇంత విషాదం ఉందా?

Published : Apr 10, 2026, 12:26 PM IST

జబర్ధస్త్ తో పాటు వెండితెరపై కామెడీ జల్లు కురిపించే చలాకీ చంటి జీవితంలో ఎంత పెద్ద విషాదం ఉందో తెలుసా? ఆయన నవ్వుల వెనుక ఎన్ని కష్టాలు ఉన్నాయంటే? నమ్మిన వారి చేతిలో మొసపోయి.. చంటి పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు.

PREV
15
జబర్ధస్త్ వల్ల స్టార్ ఇమేజ్..

తెలుగు బుల్లితెరపై పాపులర్ కామెడీ షోలలో జబర్దస్త్. ఈషో ఎంతో మంది కళాకారుల జీవితాన్ని మార్చేసింది. ఎంతో మంది స్టార్ కమెడియన్స్ జబర్దస్త్ వల్ల టాలీవుడ్ లో పాపులర్ అయ్యారు. అలాంటి స్టార్స్ లో చలాకీ చంటి కూడా ఒకడు. ఈ షోకి రాకముందే పాపులర్ అయిన చంటీ.. జబర్ధస్త్ ద్వారా మరింత గుర్తింపు సాధించాడు. ప్రత్యేకమైన కామెడీ టైమింగ్, స్టేజ్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను అలరించిన చంటి, టెలివిజన్ నుంచి సినిమాల వరకూ తన ప్రతిభను చాటుకున్నాడు.

25
వెండితెరపై రాణించిన చలకీ చంటి..

జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు పొందిన చంటి, తరువాత సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా పలు అవకాశాలు అందుకున్నారు. ఒక దశలో జబర్దస్త్‌లోని సీనియర్ ఆర్టిస్టులు సినిమాల వైపు వెళ్లడంతో, చంటి కూడా అదే దారిని ఎంచుకుని షోను వదిలి సినిమాల్లో నటించడం ప్రారంభించారు. ఆ సమయంలో ఆయన కెరీర్ మంచి స్థాయికి చేరుకుంది. అనంతరం Bigg Boss Telugu Season 6 లో కూడా కంటెస్టెంట్‌గా పాల్గొని మరింత పాపులర్ అయ్యాడు చంటి.

35
చలాకీ చంటి కెరీర్‌లో ఊహించని మార్పులు

అయితే, జబర్దస్త్ వదిలిన తరువాత ఆయన కెరీర్‌లో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. కొంతకాలం అవకాశాలు తగ్గడంతో ఆయన కొంత వెనుకబడినట్లు కనిపించారు. మధ్యలో ఆరోగ్య సమస్యల కారణంగా కూడా కొంత విరామం తీసుకున్నారు. ప్రస్తుతం మళ్లీ టీవీ షోలలో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.తాజాగా Suma Adda కార్యక్రమంలో పాల్గొన్న చంటి, తన వ్యక్తిగత జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు, కెరీర్ లో జరిగిన విషయాలను షేర్ చేసుకున్నారు.

45
చంటి జీవితంలో తీవ్ర విషాదం..

చంటి మాట్లాడుతూ.. తన జీవితంలో ఒక విషాద సంఘటనను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ, “నాకు ఆరేళ్ల వయసులో ఉండగా మా అమ్మకు ఫైర్ యాక్సిడెంట్ జరిగి మరణించింది. కళ్ల ముందే ఆమె కాలిపోతుండటం చాలా బాధగా అనిపించింది. ఆ వయసులో ఏం చేయాలో తెలియదు. అప్పుడే తెలిస్తే ఆమెను కాపాడేవాడిని” అని భావోద్వేగంతో తెలిపారు. తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించే చంటి జీవితంలో ఇంతటి బాధ ఉందని తెలిసి అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ సంఘటన ఆయన వ్యక్తిత్వాన్ని, జీవితాన్ని బాగా ప్రభావితం చేసింది.

55
కష్టాల్లో ఉంటే ముఖం కూడా చూడలేదు..

మరో ఇంటర్వ్యూలో చలాకీ చంటి మాట్లాడుతూ, “ఈ కాలంలో డబ్బులు ఉంటేనే మనిషికి విలువ. డబ్బులు ఉన్నప్పుడు నా చుట్టూ అందరూ ఉండేవారు. కానీ నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఇండస్ట్రీలో బాగా పరిచయం ఉన్న ఎంతో మంది నా వైపు చూడడం కూడా మానేశారు. ఎదురుపడితే కనీసం పలకరించేవాళ్లు కూడా కాదు. నాపై కొంతమంది దుష్ప్రచారాలు చేయడం వల్ల సినిమాల్లో అవకాశాలు కోల్పోయాను. నాకు ఈగో ఎక్కువ అని, షూటింగ్స్‌కు ఎక్కువ డబ్బులు అడుగుతానని, ఇంకేదో అడుగుతానని.. సంబంధం లేని వివాదాల్లో నన్ను ఇరికించి అవకాశాలు రాకుండా చేశారని'' చలాకీ చంటి చెప్పారు.

Read more Photos on
click me!

Recommended Stories