సమంత రెండో పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందా, ఆ పోస్ట్ ని లైక్ చేయడంతో కొత్త అనుమానాలు ?
సక్సెస్ వెర్స్ అనే ఇంస్టాగ్రామ్ పేజీ నుంచి స్త్రీ పురుషుల వివాహ బంధం గురించి ఒక పోస్ట్ వైరల్ గా మారింది. ఈ పోస్ట్ ని సమంత లైక్ చేయడం ఆసక్తిగా మారింది.
సక్సెస్ వెర్స్ అనే ఇంస్టాగ్రామ్ పేజీ నుంచి స్త్రీ పురుషుల వివాహ బంధం గురించి ఒక పోస్ట్ వైరల్ గా మారింది. ఈ పోస్ట్ ని సమంత లైక్ చేయడం ఆసక్తిగా మారింది.
నటిగా సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న సమంత ఇకపై నిర్మాతగా కూడా రాణించాలని ప్రయత్నిస్తోంది. తొలి ప్రయత్నంగా ఆమె నిర్మించిన శుభం అనే చిత్రం మే 9న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా సమంత తిరుమల సందర్శించి శ్రీవారి ఆశీస్సులు పొందింది. అయితే సమంత తిరుమలని సందర్శించడం చర్చనీయాంశంగా మారింది.
తిరుమలకి సమంతతో పాటు ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు కూడా వెళ్లారు. వీరిద్దరూ అక్కడ ప్రత్యేక పూజలు చేసినట్లు వార్తలు వచ్చాయి. తిరుమలలో సమంత, రాజ్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీరిద్దరూ కాళహస్తికి కూడా వెళ్లి అక్కడ రాహు కేతు పూజ చేసినట్లు తెలుస్తోంది. ఇందంతా పెళ్లి కోసమే సమంత చేస్తోంది అంటూ వార్తలు వస్తున్నాయి.
కొంతకాలంగా సమంత, రాజ్ డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పలు సందర్భాల్లో సామ్, రాజ్ తో కనిపించింది. సమంత, రాజ్ పెళ్ళికి ఇరు కుటుంబాల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. కుటుంబ సభ్యులు అంగీకారం తెలపడంతో మేలో సామ్, రాజ్ పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధం అవుతున్నారనేది తాజాగా వినిపిస్తున్న టాక్.
ఇదిలా ఉండగా సమంత మరో విషయంలో కూడా వార్తల్లో నిలిచింది. సక్సెస్ వెర్స్ అనే ఇంస్టాగ్రామ్ పేజీ నుంచి స్త్రీ పురుషుల వివాహ బంధం గురించి ఒక పోస్ట్ వైరల్ గా మారింది. ఈ పోస్ట్ ని సమంత లైక్ చేయడం ఆసక్తిగా మారింది. ఇంతకీ ఆ పోస్ట్ లో ఏముందంటే.. భార్యలు తీవ్రమైన అనారోగ్యానికి గురైతే.. భర్తలు వారిని వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సర్వేలో తేలిందట. భార్యలు ప్రాణాంతకమైన అనారోగ్యానికి గురైతే 21 శాతం మంది భర్తలు వారి నుంచి విడిపోతున్నారట. అదే భర్తలు ప్రాణాంతకమైన వ్యాధికి గురైతే భార్యలు విడిపోవాలనుకునే శాతం 2.9 శాతం మాత్రమే అని సర్వేలో తేలిందట. భార్యలు అనారోగ్యంతో ఉంటే వారి నుంచి విడిపోవాలనుకునే భర్తలు ఎక్కువ.
కానీ భర్తలు అనారోగ్యంతో ఉంటే వారితో కలసి జీవించే భార్యలు ఎక్కువ అని తేలింది. దీనిపై ఇంటర్వ్యూలో చర్చ జరిగింది. ఈ పోస్ట్ ని సమంత లైక్ చేసింది. సమంత కూడా గతంలో భయంకరమైన మయో సైటిస్ వ్యాధికి గురైన సంగతి తెలిసిందే. అమెరికాకి వెళ్లి సమంత చికిత్స తీసుకుంది. సుదీర్ఘకాలం చికిత్స తర్వాత సమంత కోలుకుంది. 2022లో సమంత మయో సైటిస్ కి గురైంది. కానీ అంతకంటే ముందే 2021లో సమంత, చైతన్య విడిపోయారు. చైతు, సమంత విడిపోవడానికి ప్రధాన కారణం ఇంతవరకు ఎవరికీ తెలియదు.