బ్లాక్ గౌన్ లో ప్రణీతా సుభాష్.. మరింత యంగ్ లుక్ లో బుట్టబొమ్మ.. ఆ యాడ్ ను గుర్తుచేస్తున్న నెటిజన్లు

First Published | Sep 30, 2023, 12:50 PM IST

ప్రణీతా సుభాష్ పెళ్లి తర్వాత కూడా కెరీర్ ను కొనసాగిస్తోంది. ప్రస్తుతం మలయాళంలో తొలిచిత్రం చేస్తోంది. ఈ సందర్భంగా మరిన్ని అవకాశాల కోసం నెట్టింట ఎప్పుడూ యాక్టివ్ గా కనిపిస్తోంది. నయా లుక్స్ తో కట్టిపడేస్తోంది.
 

కన్నడ బ్యూటీ ప్రణీతా సుభాష్ (Pranitha Subhash)  తెలుగు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సౌత్ సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. గ్లామర్, నటనతో ఆకట్టుకుంది. 

తెలుగులో ‘బావ’, ‘రభస’, ‘అత్తారింటికి దారేది’, ‘హాలో గురు ప్రేమకోసమే’ వంటి చిత్రాల్లో నటించి ఆడియెన్స్ కు గుర్తుండిపోయేలా చేసింది. అటు తమిళం, కన్నడలోనూ వరుస చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. స్టార్ సరసన మెరిసి క్రేజ్ దక్కించుకుంది.
 


కెరీర్ మంచిగా సాగుతున్న క్రమంలోనే ప్రణీతా పెళ్లి పీటలు ఎక్కింది. వ్యాపారవేత్త నితిన్ రాజుతో ప్రణీత వివాహం జరిగింది. 2021లో వీరిద్దరికి వివాహం చాలా సింపుల్ గా, ఎలాంటి హంగామా లేకుండా జరిగింది. కరోనా ఆంక్షలు ఉండటంతో నిరాడంభరంగా వేడుకగా సాగింది. ఇక గతేడాది పండంటి ఆడబిడ్డకూ జన్మనిచ్చింది.
 

పెళ్లి, ఆ తర్వాత తల్లిగా ప్రమోషన్ పొందిన ప్రణీతా ప్రస్తుతం సినిమా అవకాశాల వేటలో ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సందర్భంగా సోషల్ మీడియాలో నిత్యం కనిపిస్తోంది. పలు సినీ ఈవెంట్లలోనూ మెరుస్తూ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా తన గ్లామర్ తో కట్టిపడేస్తోంది.

ఓ బిడ్డకు జన్మనిచ్చినా చెక్కుచెదరని అందంతో కట్టిపడేస్తోంది. స్టన్నింగ్ అవుట్ ఫిట్లలో అందాల విందు చేస్తోంది. తాజాగా బ్లాక్ గౌన్ లో గ్లామర్ షోచేసింది. పొట్టి గౌన్ లో మరింత యంగ్ గా దర్శనమిచ్చింది. క్యూట్ ఫోజులతో కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. మత్తు చూపులతో మైమరిపించింది.

అయితే, ఇలా వరుసగా గ్లామర్ ఫొటోలను పంచుకున్న ప్రణీతాను చూసి ఫ్యాన్సే కాదు.. నెటిజన్లూ ఫిదా అవుతున్నారు. సంతూరు యాడ్ లో మమ్మీలా ఉందంటున్నారు. ఏమాత్రం అందం, ఫిట్ నెస్ విషయంలో మార్పు రాకుండా జాగ్రత్త వహించడంపై ప్రశంసిస్తున్నారు. నయా లుక్ ను పొగుడుతూ ఆకాశానికి ఎత్తున్నారు. ప్రస్తుతం మలయాళంలోకి ఎంట్రీ ఇస్తూ ‘దిలీప్ 148’ చిత్రంలో నటిస్తోంది. 
 

Latest Videos

click me!