తల్లిగా బాధ్యతలను గుర్తుచేసుకుంటూ ప్రణీత ఇంట్రెస్టింగ్ పోస్ట్.. బుట్టబొమ్మపై నెటిజన్ల పొగడ్తలు!

First Published | Jan 22, 2023, 3:55 PM IST

టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత సుభాష్ (Pranitha Subhash) పెళ్లి తర్వాత కూడా తన అభిమానులకు సోషల్ మీడియాలో దగ్గరగానే ఉంటోంది. ఇంట్రెస్టింగ్ పోస్టులతో ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో లేటెస్ట్ పోస్టు ఇంట్రెస్టింగ్ గా మారింది.
 

కన్నడ బ్యూటీ, గ్లామరస్ హీరోయిన్ ప్రణీతా సుభాష్ కు తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు, ఫాలోయింగ్ ఉంది. స్టార్ హీరోల సరసన నటించి ఈ ముద్దుగుమ్మ తన అందం, అభినయంతో కట్టిపడేసింది. తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.
 

అయితే, 2021 మేలో వ్యాపార వేత్త నితిన్ రాజు ను ప్రణీత సుభాష్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసి 2022 జూన్ 10న బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తోంది.


పెళ్లి, ప్రెగెన్సీ కారణంగా రెండేండ్లుగా సినిమాలకు దూరంగానే ఉంటోందీ ముద్దుగుమ్మ. ఇక ప్రస్తుతం మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో తెగ  యాక్టివ్ గా కనిపిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ పోస్టులతో అభిమానులతో పాటు నెటిజన్లు ఆకట్టుకుంటోంది.

మరోవైపు గ్లామర్ విందు కూడా చేస్తోందీ బ్యూటీ. పెళ్లై ఒక బిడ్డకు జన్మనిచ్చినా చెక్కు చెదరని అందంతో ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో అదిరిపోయే అవుట్ ఫిట్లలోనూ పొటోషూట్లు చేస్తూ అందాల విందు చేస్తోంది. తాజాగా క్యాజువల్ డ్రెస్ లో సండ్ ట్రీట్ అదరగొట్టింది.
 

లేటెస్ట్ గా ప్రణీత పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. వైట్ జీన్స్, క్రాప్డ్ టీషర్ట్ లో టెంప్టింగ్ గా పోజులిస్తూ కుర్ర గుండెల్ని పేల్చేసింది. ప్రణీత కవ్వింపు చర్యలకు నెటిజన్లు ఉక్కిరిబిక్కి అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో ఫొటోలను వైరల్ చేస్తున్నారు. అయితే ప్రణీత ఈ ఫొటోలను పంచుకుంటూ ఇంట్రెస్టింగ్ గా క్యాప్షన్ ఇచ్చింది.
 

‘సండే వైబ్స్.. హో ఆగండి.. తల్లులకు ఆదివారాలు ఉండవు’ అంటూ ఆసక్తికరంగా క్యాప్షన్ ఇచ్చింది. ప్రణీత కూడా కొద్ది నెలల కిందనే తల్లిగా ప్రమోషన్ పొందడంతో ఈరకంగా ఆ బాధ్యతలను గుర్తు చేసుకుంది. మరోవైపు తను రీసెంట్ గా పోస్ట్ చేసిన ఓ డాన్స్ రీహార్సల్ లోనూ కాళ్లకు మెట్టలు ఉంచుకొని ‘పెళ్లి’ని గౌరవించడం పట్ల నెటిజన్లు పొగుడుతున్నారు. సంప్రదాయానికి కట్టుబడి ఉండటం పట్ల ప్రశంసలతో ఆకాశానికి ఎత్తుతున్నారు.

Latest Videos

click me!