Vikram: కమల్ హాసన్ 'విక్రమ్‌' రివ్యూ

First Published | Jun 3, 2022, 2:04 PM IST

యూనివర్సల్ హీరో కమల్ హాసన్, సక్సెస్ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో  అత్యంత భారీ అంచనాల తో కూడిన యాక్షన్ థ్రిల్లర్ `విక్రమ్`. ఆసక్తికరమైన ప్రచారంతో ఈ చిత్రం అంచనాలను పెంచింది.  ఈ చిత్రం ఈ రోజు రిలీజైంది. 
 

vikram movie review


కమల్‌హాసన్‌(Kamal Haasan), విజయ్‌ సేతుపతి(Vijay Sethupathi), ఫహద్‌ ఫాజిల్‌(Fahadh Faasil),వీళ్లు చాలదన్నట్లు తమిళ స్టార్ సూర్య  కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘విక్రమ్‌’.ఇంతమంది తెరపై ఒకేసారి కనపడతారంటే క్రేజ్ ఏ రేంజిలో ఉంటుంది. అదీ ప్రక్కన పెడితే ఈ సినిమాకు డైరక్టర్ లోకేశ్‌ కనకరాజ్‌. ఆయన గతంలో చేసిన ఖైదీ, మాస్టర్ సినిమాలు సూపర్ హిట్. అలాగే సినిమాల్లో కొత్తదనం కొట్టివచ్చినట్లు కనపడుతుంది. దాంతో ఈ సినిమాలోనూ ఏదో చేసే ఉంటారు అనే భావన మనలోనూ కలుగుతుంది. ఇవన్నీ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసాయి. ఈ క్రమంలో రిలీజైన ఈ చిత్రం ఆ పాజిటివె వైబ్స్ ని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లిందా..అసలు కథేంటి..కమల్ ప్రతీ పాత్రకు టు డైమన్షన్స్ ఉంటాయన్నారు. అవేమిటి... సూర్య పాత్ర ఎప్పుడు వస్తుంది. తెలుగు వారికి నచ్చుతుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.


కథేంటి
సంతానం (విజయ్ సేతుపతి) కి చెందిన డ్రగ్స్ తో నింపబడ్డ కంటైనర్ చెన్నైలో మిస్సవుతుంది. దాంతో అతను చాలా డిస్ట్రబ్ అవుతాడు. అతనికి పై నుంచి చాలా ప్రెజర్ ఉంటుంది. మరో ప్రక్క సిటీలో మర్డర్స్ జరుగుతూంటాయి. ఈ క్రమంలో అండర్ కవర్ పోలీస్ అమర్ ( ఫహద్‌ ఫాజిల్‌) ఎంట్రీ ఇస్తాడు. ఈ ఇన్విస్టిగేషన్ లో ఓ ముసుగు మనిషి గురించి తెలుస్తుంది. అంతేకాదు అతని చేతిలో చనిపోయిన కర్ణన్ (కమల్ హాసన్) వివరాలు తెలుస్తాయి. కర్ణన్ ఓ తాగుబోతు అని, గంజాయి తీసుకుంటాడని, ఈ వయస్సులో కూడా అమ్మాయిల దగ్గరకు వెళ్తూంటాడని ఇలా రకరకాల విషయాలు బయిటకు వస్తాయి.  


దాంతో ఒకింత డౌట్ తో అసలు ఈ కర్ణన్ ఎవరు...అతనికి ఈ డ్రగ్  మాఫియా కి లింకేంటి అనేది తవ్వటం మొదలెడతాడు. ఈ క్రమంలో షాక్ ఇచ్చే చాలా విషయాలు బయిటకు వస్తాయి. ఇంతకీ కర్ణన్ కథేంటి...ముసుగు మనిషి ఎవరు...ఇంతకీ విక్రమ్ ఎవరు...డ్రగ్స్ కంటైనర్ ని దొంగతనం చేసింది ఎవరు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 


విశ్లేషణ

ఇది కాంక్రీట్ అడవి అనుకుంటే.. ఇది కూడా అడవే. క్రైమ్ విషయానికి వస్తే డ్రగ్స్ కానీ మరొకటి కానీ.. మనిషిని వేటాడే జంతువులా మారిపోయాడు మనిషి. అనుకోకుండా ఇలాంటి అడవిలో మనమంతా బాగస్వాములుగా వున్నాం. విలన్ అనే వాడు మార్స్ నుండి దిగిరాడు. విక్రమ్ కథలో ఇలాంటి అంశాలాన్నీ చూస్తాము. ఇందులో ప్రతి పాత్రకు రెండు కోణాలు వుంటాయి. విక్రమ్ డార్క్ మూవీ. మేకింగ్ పరంగా దర్శకుడు లోకేష్ కనకరాజ్ అద్భుతంగా తీశారు. అయితే విక్రమ్ నుంచి ఎక్సపెక్ట్ చేసిన స్దాయిలో   గ్రేట్ థియేటర్ ఎక్స్ పిరియన్స్ ఇవ్వదు. ట్విస్ట్ లు కోసం కథను దాచి పెట్టిన విధానంలో ఫస్టాఫ్ లో కమల్ పాత్రే మాయమైంది. 


ఫస్టాఫ్ లో పది నిముషాలు కూడా కమల్ కనపడరు.  కమల్ లేకుండా కమల్ సినిమాని ఎంజాయ్ ఎలా చేస్తాము. ఫస్టాఫ్ మొత్తం ఫహద్‌ ఫాజిల్‌ హారో అనే స్దాయిలో కథ జరుగుతుంది. కమల్ కోసం  సినిమాకు వచ్చిన వాళ్లకు  విసిగిస్తుంది. అయితే ఇంట్రవెల్ ట్విస్ట్ కోసం స్క్రీన్ ప్లే ఇలా డిజైన్ చేసారని ఓకే అనుకుంటాం. ఇక సెకండాఫ్ లో ఫహద్‌ ఫాజిల్‌ పెద్దగా ఏమీ ఉండదు. కమల్ కు ఎమోషన్ డ్రామా పెట్టారు. ఆయన పాత చిత్రం విక్రమ్ ని గుర్తు చేస్తారు. అలాగే ఈ సినిమా తన కొడుకుని చంపిన వారిపై పగ తీర్చుకునే కథలా ఉంటుంది. కానీ మళ్లీ జనం అలా అనుకోకూడదని ఇది రివేంజ్ స్టోరీ కాదని చెప్తారు.  

అలాగే ఎప్పుడైతే అసలు కమల్ ఇదంతా ఎందుకు చేస్తున్నారో మిస్టరీ వీడాక..రొటీన్ యాక్షన్ సినిమాలా మారిపోతుంది. క్లైమాక్స్ కూడా బాగా ఓవర్ డోస్ లా అనిపిస్తుంది. కమల్ ఈ వయస్సులో ఇలాంటి పాత్ర చేసారని ఆనందపడటం తప్పిస్తే ఆ విషయం ప్రూవ్ చేయటానికి ...ఇంత యాక్షన్ పెట్టాలా అనిపిస్తుంది. అక్కడక్కడా వచ్చే కొన్ని ట్విస్ట్ లు, యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి తప్పిస్తే మిగతాదంతా మామూలుగానే ఉంటుంది. దానికి తోడు సినిమాకు రన్ టైమ్ కూడా చాలా ఎక్కువ సేపు కావటంతో సినిమా ఓ టైమ్ లో ఇంక అవ్వదా ఫీలింగ్ తెచ్చిపెట్టింది. ఖైదీ సినిమా లోని కొన్ని లింక్స్ ను ఈ సినిమాలో కూడా చూపించటం కొంతమందికి నచ్చుతుంది.

Vikram movie

టెక్నికల్ గా...

మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు. ‘పతళ పతళ’ సాంగ్ అదిరిపోయే బీట్, మాస్ స్టెప్పులతో థియేటర్‌లలో ఫ్యాన్స్ పండగ చేసుకునేలా వుంది . ఈ పాటలో కమల్ హాసన్ తన మార్క్ డ్యాన్స్ మూవ్స్‌తో వింటేజ్ గ్రేస్‌ చూపించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టెర్రిఫిక్ గా ఉంది. కెమెరా వర్క్ కూడా ఓ రేంజిలో ఉంది. ప్రతీ చిన్న మూమెంట్ ని చాలా రిచ్ గా చూపించారు. ఆర్ట్ డైరక్షన్, యాక్షన్ కొరియోగ్రఫీ కూడా చెప్పుకోదగిన రీతిలో ఉన్నాయి. రైటింగ్ కాస్త గజిబిజి తగ్గిస్తే బాగుండేది. ఎడిటింగ్ కూడా మరింత షార్ప్ చేసి, లెంగ్త్ తగ్గిస్తే బాగుండేది. 

నటీనటుల్లో ముగ్గురు నట శిఖరాలే. కాబట్టి ప్రత్యేకంగా వారి గురించి చెప్పుకునేదేమీ లేదు. పోటీపడ్డారు అనేది చిన్న పదం. కమల్ ఈ వయస్సులో కూడా ఇంకా తనలోని యాక్షన్ స్టార్ ఉన్నాడని నిరూపించుకునే ప్రయత్నం చేసారు.


నచ్చినవి 
కమల్‌హాసన్‌, విజయ్‌ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌ ఒకేసారి తెరపైకనపడటం
సూర్య కామియో
టెక్నికల్ వాల్యూస్


నచ్చనవి

రన్ టైమ్
  ఎమోషన్ సీన్స్ ఉన్నా అవి కనెక్ట్ కాకపోవటం
ఎంతకీ పూర్తిగాని క్లైమాక్స్  
ప్రెడిక్టబుల్ కథ
గ్లామర్ యాంగిల్ పూర్తిగా వదిలేయటం


ఫైనల్ థాట్

కమల్..అద్బుతమైన నటుడే కాదనలేం కానీ...మరీ ఒక్కసినిమాలోనే విశ్వరూపం చూపెట్టాలనుకుంటే తట్టుకోవద్దూ..
----సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating: 2.5

బ్యానర్: రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్
నటీనటులు: కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్, కాళిదాస్ జయరామ్, నరేన్, అర్జున్ దాస్, శివాని నారాయణన్ తదితరులు
సంగీతం : అనిరుధ్ రవిచందర్
సినిమాటోగ్రాఫర్:  గిరీష్ గంగాధరన్ , 
ఎడిటర్: ఫిలోమిన్ రాజ్ 
దర్శకత్వం: లోకేష్ కనగరాజ్
నిర్మాతలు: కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్
తెలుగు రిలీజ్ : శ్రేష్ట్ మూవీస్
విడుదల తేదీ : 03, జూన్ 2022.

Latest Videos

click me!