డాటర్స్ డే సందర్భంగా కూతురితో ప్రణీతా సుభాష్ క్యూట్ పిక్స్.. తల్లిగా మురిసిపోతున్న బుట్టబొమ్మ..

First Published | Sep 24, 2023, 4:35 PM IST

గ్లామరస్ హీరోయిన్ ప్రణీతా సుభాష్ ఓ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈరోజు డాటర్స్ డే సందర్భంగా తన కూతురుతో ఫొటోలకు ఫోజులిచ్చింది. చిన్నారిని ముద్దులతో ముంచేస్తూ తల్లిగా మురిసిపోయింది. 
 

కన్నడ బ్యూటీ ప్రణీతా సుభాష్ (Subhash)  దక్షిణాది ప్రేక్షకుల్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కన్నడతో పాటు తెలుగు, తమిళంలోనూ నటించి ప్రేక్షకులను తన ఫ్యాన్స్ గానూ మార్చుకుంది. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. 
 

తెలుగులో ఈ ముద్దుగుమ్మ ‘బావ’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే ఆడియెన్స్  ను ఆకట్టుకుంది. దాంతో తెలుగులో మరిన్ని అవకాశాలు అందాయి. ఇక్కడ చేసింది కొన్ని సినిమాలే అయినా తన పెర్ఫామెన్స్ తో గుర్తుండిపోయేలా చేసింది. తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది.
 


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘అత్తారింటికి దారేది’లో నటించి ఆకట్టుకుంది. అందం, అభినయంతో కట్టిపడేసింది. ఆ తర్వాత వచ్చిన ‘హలో గురు ప్రేమకోసం’ కోసంతో కూడా  ఆకట్టుకుంది. తన పెర్ఫామెన్స్ తో ఫిదా చేసింది. 
 

ఇదిలా ఉంటే.. పెళ్లి చేసుకొని పర్సనల్ లైఫ్ లోనూ ప్రణీతా సెటిల్ అయ్యింది.వ్యాపార వేత్త నితిన్ రాజ్ అనే వ్యక్తిని లాక్ డౌన్ లోనే సంప్రదయ పద్ధతుల్లో పెళ్లి చేసుకుంది. గతేడాది పండంటి ఆడబిడ్డకూ జన్మనిచ్చింది. తరచూ తన కూతురుతో కలిసి దిగిన క్యూట్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

ఇక ఈరోజు డాటర్స్ డే కావడంతో తనచిన్నారి కూతురుతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చింది. కూతురును ముద్దులతో ముంచేస్తూ మురిసిపోయింది. తల్లిగా సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఇలా చూసిన ఫ్యాన్స్ కూడా ఖుషీ అవుతున్నారు. 

మరికొందరు మాత్రం ఇప్పటికీ సంతూరు మమ్మీలానే ఉందంటూ ఆమె అందాన్ని పొడుతూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ఇక కెరీర్ లో ప్రణీతా సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. ప్రస్తుతం మలయాళంలో ఓ సినిమా చేస్తోంది. సూపర్ స్టార్ దిలీప్ కుమార్ సరసన నటిస్తోంది. త్వరలో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
 

Latest Videos

click me!