2018లో కెజిఎఫ్ రూపంలోవెండితెరపై ఓ అధ్బుతం ఆవిష్కృతం అయ్యింది. కన్నడ పరిశ్రమ నుండి వచ్చిన ఓ పాన్ ఇండియా చిత్రం దేశం మొత్తాన్ని ఆకట్టుకుంది. కన్నడ యంగ్ హీరో యష్ని పాన్ ఇండియా స్టార్ ని చేసింది. ఆ మూవీతో యష్ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు.
ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ పేరు సైతం మారుమ్రోగింది. ఓ సాధారణమైన మాఫియా కథకు పట్టుసడలని స్క్రీన్ ప్లే రాసుకున్న ప్రశాంత్ నీల్ కొత్త అధ్యాయం రచించారు. పదుల సంఖ్యలో కీలక పాత్రలు ఉన్న ఆ కథకు ఏ మాత్రం స్క్రీన్ ప్లే విఫలం చెందినా మూవీ ఘోర పరాజయం చూసేది. కెజిఎఫ్ ఇనిషియల్ టాక్ కూడా నెగెటివ్ గానే వచ్చింది. మూవీలోని విషయం అర్థం అయ్యాక ప్రతి ఒక్కరికి బాగా ఎక్కేసింది.
హీరో రాఖీ పాత్రకు ఓ సీనియర్ జర్నలిస్ట్ ఇచ్చే ఎలివేషన్ మైండ్ బ్లోయింగ్. కన్నడ నటుడు అనంత్ నాగ్ ఆపాత్రను చేయగా, సినిమాకుఎంతో ప్లస్ అయ్యింది. ఆ పాత్రకు డబ్బింగ్ చెప్పిన తెలుగు సీనియర్ నటుడు శుభలేఖ సుధాకర్ వాయిస్ చాలా ప్రత్యేకంగా నిలిచింది.
కాగా కెజిఎఫ్ 2 నుండి నటుడు అనంత్ నాగ్ తప్పుకున్నారని వార్తలు రావడం జరిగింది. కొన్ని అనుకోనికారణాలఅనంత్ నాగ్కెజిఎఫ్ 2లో నటించడం లేదనివినికిడి. ఐతే ఈ పాత్ర కోసం ప్రకాష్ రాజ్ ని తీసుకున్నారా అనే డౌట్ మొదలైంది. కెజిఎఫ్ 2 షూట్ తిరిగి మొదలుకాగా, సెట్స్ లో నటుడు ప్రకాష్ రాజ్ పాల్గొన్నారు.
ప్రకాష్ రాజ్ కి దర్శకుడు ప్రశాంత్ నీల్ఓ సీన్ వివరిస్తున్న ఫోటో బయటికి రావడం జరిగింది. ఆ ఫొటోలో ప్రకాష్ రాజ్ గెటప్కెజిఎఫ్ 2లోఅనంత్ నాగ్ పాత్రను పోలివుంది. మరి ప్రకాష్ రాజ్ చేస్తుంది ఆ సీనియర్ జర్నలిస్ట్ పాత్రేనా లేక మరో కీలకమైన పాత్ర కోసం ఆయనను తీసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది.