విలక్షణ నటుడిగా ప్రకాష్ రాజ్ ఇండియా మొత్తం పాపులర్ అయ్యారు. సౌత్ సహా అనేక భాషల్లో తన నటనతో ప్రశంసలు అందుకున్నాడు. దశాబ్దాల కాలం నుంచి నెగిటివ్ రోల్స్ తో పాటు, కీలక పాత్రల్లో నటిస్తూ అలరిస్తున్నారు.
విలక్షణ నటుడిగా ప్రకాష్ రాజ్ ఇండియా మొత్తం పాపులర్ అయ్యారు. సౌత్ సహా అనేక భాషల్లో తన నటనతో ప్రశంసలు అందుకున్నాడు. దశాబ్దాల కాలం నుంచి నెగిటివ్ రోల్స్ తో పాటు, కీలక పాత్రల్లో నటిస్తూ అలరిస్తున్నారు. అయితే ప్రకాష్ రాజ్ తరచుగా చేసే రాజకీయ వ్యాఖ్యలు ఆయన్ని చిక్కుల్లోకి నెడుతుంటాయి. అయినప్పటికీ ప్రకాష్ రాజ్ వెనుదిరగకుండా మోడీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం చూస్తూనే ఉన్నాం.
26
మోడీని విమర్శించే క్రమంలో ప్రకాష్ రాజ్ చేసే కొన్ని వ్యాఖ్యలు దుమారం రేపడం చూస్తూనే ఉన్నాం. ఇటీవల ప్రకాష్ రాజ్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 నేడు విజయవంతం అయింది. యావత్ దేశం గర్వించేలా.. ప్రపంచం మొత్తం ఇండియా వైపు తొంగి చూసేలా విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలాన్ని సాఫ్ట్ గా ముద్దాడింది.
36
దీనితో సినీ రాజకీయ ప్రముఖులు, క్రీడాకారులు, విద్యావేత్తలు అన్ని రంగాల వారు ఇస్రో సాధించిన ఘనతపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఇటీవల ప్రకాష్ రాజ్ చంద్రయాన్ 3 ప్రయోగాన్ని కించపరిచే విధంగా పోస్ట్ చేయడం తెలిసిందే. మూన్ నుంచి ఫస్ట్ పిక్చర్స్ అంటూ ప్రకాష్ రాజ్ కొన్ని వివాదాస్పద పోస్ట్ లు చేశాడు.
46
ప్రకాష్ రాజ్ కించపరిచినప్పటికీ చంద్రయాన్ 3 విజయవంతం కావడంతో నెటిజన్లు అతడికి చుక్కలు చూపిస్తూ ట్రోల్ చేస్తున్నారు. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ తీసిన తొలి ఫోటో ఇదే అంటూ ప్రకాష్ రాజ్ బురదలో ఒక్కడు చిత్రంలో ఉన్న దృశ్యాన్ని పోస్ట్ చేస్తున్నారు.
56
మరికొందరు అయితే విక్రమ్ ల్యాండర్, రోవర్ చంద్రుడిపై నీటిని గుర్తించాయి. ఆ బురదలో ప్రకాష్ రాజ్ కనిపించారు అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇలా వరుసగా ప్రకాష్ రాజ్ పై మీమ్స్, ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
66
అయితే చంద్రయాన్ 3 ని కించపరిచే విధంగా ప్రకాష్ రాజ్ పెట్టిన పోస్ట్ కి గాను అతడిపై కేసు కూడా నమోదు చేశారు. ఇదిలా ఉండగా టాలీవుడ్ నుంచి చిరంజీవి, రాజమౌళి, బాలయ్య, మోహన్ బాబు లాంటి ప్రముఖులంతా చంద్రయాన్ 3 విజయం పట్ల ఇస్రోని అభినందిస్తున్నారు.