బాలకృష్ణ, వెంకటేష్‌, నాని.. కూతురి కోసం పోరాటం.. సెంటిమెంట్‌ పండించబోతున్న స్టార్స్..

Published : Aug 23, 2023, 06:51 PM IST

తెలుగు సినిమాల్లో సెంటిమెంట్‌కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. తెలుగు ఆడియెన్స్ ఆ ఎమోషన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంటారు. అందుకే ఫ్యామిలీ సెంటిమెంట్స్ తో సినిమాలు వస్తుంటాయి. తాజాగా కూతురు సెంటిమెంట్‌తో సినిమాలొస్తున్నాయి.   

PREV
15
బాలకృష్ణ, వెంకటేష్‌, నాని.. కూతురి కోసం పోరాటం.. సెంటిమెంట్‌ పండించబోతున్న స్టార్స్..

మనిషి మానవ సంబంధాలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటారు. వాటికే ఎక్కువగా ఫిదా అవుతుంటారు. అదే మనిషి వీక్‌నెస్‌ కూడా. అయితే అది పాజిటివ్‌ యాంగిల్‌లోనే ఎక్కువగా ఉంటుంది. సినిమాల్లో సెంటిమెంట్‌కి అధిక ప్రాధాన్యత ఉంటుంది. తల్లి సెంటిమెంట్‌, ఫాదర్‌ సెంటిమెంట్‌, బ్రదర్‌ సెంటిమెంట్‌, ఫ్రెండ్స్, భార్య, కొడుకు,కూతురు సెంటిమెంట్ ఆధారంగా చాలా సినిమాలు వచ్చాయి. బాక్సాఫీసు వద్ద విజయాలు సాధించాయి. ఇప్పుడు ప్రధానంగా కూతురు సెంటిమెంట్‌తో సినిమాలొస్తున్నాయి. బాలకృష్ణ, వెంకేటష్‌, నాని కూతురు సెంటిమెంట్‌తో సినిమాలు చేస్తున్నారు. 
 

25

బాలయ్య ప్రస్తుతం `భగవంత్‌ కేసరి` చిత్రంలో నటిస్తున్నారు. తెలంగాణ బ్యాక్‌ డ్రాప్‌లో సాగే చిత్రమిది. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రీలీల కూతురు పాత్ర పోషిస్తుంది. బాలకృష్ణకి ఆమె కూతురిగా కనిపించబోతుందని సమాచారం. అయితే సొంతం కూతురు కాకపోయితే కథ మొత్తం శ్రీలీల పాత్ర చుట్టే సాగుతుందట. ఆమెనే సినిమాని కీలక మలుపు తిప్పుతుందట. బాలయ్య ఆరాటం మొత్తం ఆమె కోసమే అని తెలుస్తుంది. ఇందులో తండ్రి కూతుళ్ల మధ్య అనుబంధం, ఎమోషన్స్, ఆ సెంటిమెంట్‌ బలంగా ఉంటుందని తెలుస్తుంది. అనిల్‌ రావిపూడి మార్క్ వినోదం, బాలయ్య మార్క్ యాక్షన్‌కి సెంటిమెంట్‌ మేళవింపుతో ఈ చిత్రం రూపొందుతుందని తెలుస్తుంది. ఈ చిత్రం అక్టోబర్‌ 19న రిలీజ్‌ కాబోతుంది. 
 

35

దీంతోపాటు మరో సీనియర్‌ హీరో విక్టరీ వెంకటేష్‌ కూడా కూతురు సెంటిమెంట్‌నే ఫాలో అవుతున్నారట. ఆయన ప్రస్తుతం `సైంధవ్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా కూతురు చుట్టూతే తిరుగుతుందట. ఆ చిన్నారి పాత్ర కీలకంగా ఉండబోతుందని అంటున్నారు. ఇందులో కూతురు పాత్రలో బేబీ సారా నటిస్తుంది. దీనికి `హిట్‌` చిత్రాల ఫేమ్‌ శైలేష్‌ కొలను దర్శకత్వం హిస్తున్నారు. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. యాక్షన్‌ ప్రధానంగా సినిమా సాగుతుందని, అయితే వెంకీ పోరాటం మొత్తం కూతురి కోసమే అని తెలుస్తుంది. ఈ సినిమా డిసెంబర్‌లో క్రిస్మస్‌ కానుకగా రిలీజ్‌ కాబోతుంది. 
 

45

నేచురల్‌ స్టార్‌ నాని సైతం కూతురి సెంటిమెంట్‌ని ఫాలో అవుతున్నారు. `దసరా` వంటి రా, మాస్‌ యాక్షన్‌ ఫిల్మ్ చేసిన నాని.. ఇప్పుడు ఫ్యామిలీ ఎమోషన్స్ పండించబోతున్నారు. ఆయన కూతురే ప్రాణంగా బతకబోతున్నారు. `హాయ్‌ నాన్న` చిత్రం కూతురు సెంటిమెంట్‌ ప్రధానంగానే సాగుతుందట. ఇందులో నానికి, తన భార్యకి కూతురు జన్మిస్తుంది. కానీ ఆమె ఉండదు, దీంతో కూతురే జీవితంగా బతికేస్తుంటాడు నాని. ఈ క్రమంలో తన జీవితంలోకి కూతురు ద్వారా మరో అమ్మాయి వస్తుందట. ఆమెనే మృణాల్‌ ఠాకూర్‌ అని తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ `హాయ్‌ నాన్న` కూతురు సెంటిమెంట్‌తో సాగుతుందని సమాచారం. శృతి హాసన్‌ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతుంది. శౌర్యువ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కూడా క్రిస్మస్‌ కానుకగానే విడుదల కాబోతుంది. 
 

55

సెంటిమెంట్‌ ప్రధానంగా వచ్చే సినిమాలు ఎప్పుడూ ఆదరణ పొందుతుంటాయి. తెలుగు ఆడియెన్స్ బ్రహ్మరథం పడతారు. డ్రామా వర్కౌట్‌ అయితే సినిమా సక్సెస్‌ అనే చెప్పాలి. మరీ ఈ చిత్రాలు సక్సెస్‌ బాట పడుతాయా? కూతురు నాన్నలను గెలిపిస్తారా? లేదా అనేది చూడాలి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories