సలార్ ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు రాజమౌళితో ఇంటర్వ్యూ ఏర్పాటు చేశారు యూనిట్. ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్, ప్రశాంత్ నీల్ తో కూడిన సలార్ టీమ్ ని రాజమౌళి ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
సలార్ ప్రమోషన్స్ లో ప్రభాస్ పెద్దగా పాల్గొనలేదు. నేరుగా మీడియా ముందుకు వచ్చింది లేదు. ప్రభాస్ కంటే ఎక్కువగా పృథ్విరాజ్ సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. ఆల్రెడీ విపరీతమైన బజ్ ఉంది. ప్రత్యేకంగా ప్రోమోట్ చేయాల్సిన అవసరం లేదని ప్రభాస్ భావిస్తున్నారేమో తెలియదు.
26
ఇటీవల ప్రభాస్ మోకాలికి విదేశాల్లో సర్జరీ జరిగింది. నెల రోజులకు పైగా అక్కడే రెస్ట్ తీసుకున్నాడు. ప్రభాస్ పలు భాషల్లో సలార్ చిత్రాన్ని ప్రమోట్ చేయకపోవడానికి ఇది కూడా కారణం కావచ్చు. ప్రభాస్ వివిధ భాషలు మీడియాతో మాట్లాడుకున్నా సినిమాపై భారీ హైప్ ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది.
36
మరో రెండు రోజుల్లో విడుదల అనగా... స్టార్ డైరెక్టర్ రాజమౌళితో ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. సలార్ యూనిట్ అయిన ప్రభాస్, ప్రశాంత్ నీల్, పృథ్విరాజ్ ని రాజమౌళి ప్రశ్నలు అడిగారు. మూవీ మేకింగ్ తో పాటు అనేక విషయాలు ఈ ఇంటర్వ్యూలో చర్చకు వచ్చాయి.
46
ఇప్పటి వరకూ సలార్ గురించి చెప్పని సీక్రెట్ ఏమైనా ఉందా...? అని రాజమౌళి దర్శకుడు ప్రశాంత్ నీల్ ని అడిగారు. అది క్లైమాక్స్. సెకండ్ పార్ట్ కోసం రాసుకున్న క్లైమాక్స్ లీడ్ షాక్ ఇస్తుంది. ఆ ట్విస్ట్ బాగుంటుందని వెల్లడించారు. ప్రశాంత్ నీల్ కామెంట్స్ చూస్తే సలార్ లో ఫ్యాన్స్ కోసం ఒక మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్ సిద్ధం చేశారనిపిస్తుంది.
56
ఆల్రెడీ సలార్ కథ గురించి చెప్పేశారు. మిత్రుడు పృథ్విరాజ్ కోసం ప్రాణాలైనా ఇచ్చే ప్రభాస్ అతనికి దూరంగా బ్రతకాల్సి వస్తుంది. కొన్నేళ్ల తర్వాత పృథ్విరాజ్ పై శత్రువులు దండెత్తుతారు. అప్పుడు ప్రభాస్ ని సాయంగా తెచ్చుకుంటాడు. సెకండ్ పార్ట్ కూడా చెప్పేశారు. ఈ ప్రాణ మిత్రుల మధ్యే భీకర పోరు నడుస్తుంది. మిత్రులు శత్రువులు ఎందుకు అయ్యారు అనేది అసలు ట్విస్ట్...
66
సలార్ డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈశ్వరి రావు, జగపతిబాబు, బాబీ సింహా, టిను ఆనంద్ కీలక రోల్స్ చేస్తున్నారు.