ప్రదీప్ రంగనాథన్ హీరోగా వచ్చిన 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' (LIK) సినిమా థియేటర్లలో మంచి విజయం తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. ఇంతకీ ఈ సినిమా ఎప్పుడు ఏ ఓటీటీలో రిలీజ్ కాబోతోందంటే?
ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన సైన్స్-ఫిక్షన్ రొమాంటిక్ సినిమా 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' (LIK). థియేటర్లలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఓటీటీలో రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ సినిమా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.9.93 కోట్లు వసూలు చేసింది. ఇప్పటివరకు గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లకు పైగా కలెక్ట్ చేసినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజైంది. ఇందులో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది.
24
లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఓటిటి రిలీజ్
నయనతారకు చెందిన రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ కలిసి ఈ సినిమాను నిర్మించాయి. ఇప్పుడు 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' ఓటీటీ రిలీజ్‌పై అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. మే 15 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని అంటున్నారు. కానీ, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ప్రదీప్ రంగనాథన్ - విఘ్నేష్ శివన్ కాంబోపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఓటీటీలో కూడా ఈసినిమాకు భారీ రెస్పాన్స్ వస్తుందని నమ్మకంతో ఉన్నారు.
34
వరుసగా 100 కోట్ల సినిమాలు..
గతంలో ప్రదీప్ నటించిన 'లవ్ టుడే', 'డ్రాగన్', 'డ్యూడ్' సినిమాలు వరుసగా ₹100 కోట్లు వసూలు చేసి హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. ఆ తర్వాత LIK రిలీజైంది. ఇందులో 'లవ్ టుడే' సినిమాకు ప్రదీప్ స్వయంగా దర్శకత్వం వహించడం విశేషం. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే ప్రదీప్, ఈ తరం మాస్ హీరోగా కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథన్‌తో పాటు కృతి శెట్టి, ఎస్.జె. సూర్య, మిస్కిన్, సునీల్ రెడ్డి, సీమాన్, యోగి బాబు, గౌరీ కిషన్ వంటి పెద్ద స్టార్ కాస్ట్ ఉంది.
ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. రవి వర్మన్, సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ చేయగా, ప్రదీప్ ఇ. రాఘవ్ ఎడిటింగ్ బాధ్యతలు చూసుకున్నారు. ప్రదీప్ ఇతర సినిమాలతో పోలిస్తే 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' ఓ మోస్తరు విజయాన్నే సాధించింది. ప్రదీప్ కెరీర్‌లో 100 కోట్లు వసూలు చేయని తొలి సినిమాగా ఇది నిలిచింది. వచ్చే వారం ధనుష్ సినిమా థియేటర్లలోకి రానుంది. కాబట్టి, ఆ సినిమా వచ్చేవరకు LIK థియేటర్లలో ఆడుతుందని భావిస్తున్నారు.
నిజానికి, ఈ కథలో మొదట శివకార్తికేయన్ హీరోగా నటించాల్సింది. ఈ కాంబోపై 2019లోనే ప్రకటన వచ్చింది. కానీ బడ్జెట్ సమస్యల వల్ల షూటింగ్ మొదలవకముందే ప్రాజెక్ట్ ఆగిపోయింది. దీంతో విఘ్నేష్ శివన్ కొన్ని ఏళ్లు ఈ కథను పక్కనపెట్టి, చివరికి ప్రదీప్ రంగనాథన్‌కు చెప్పి ఓకే చేయించుకున్నారు. ఈ సినిమా మొదలై దాదాపు 3 ఏళ్లు అయింది. ఎన్నో అడ్డంకుల తర్వాత LIK రిలీజైంది.