My Dear Bootham: ప్రభుదేవా 'మై డియర్ భూతం' మూవీ రివ్యూ

Published : Jul 15, 2022, 07:50 PM IST

ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా గురించి తెలియని వారుండరు. నటుడిగా, కొరియోగ్రాఫర్ గా, దర్శకుడిగా ప్రభుదేవా రాణించారు. చాలా రోజుల తర్వాత ప్రభుదేవా ఓ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్ రాఘవన్ దర్శకత్వంలో తాజాగా ప్రభుదేవా నటించిన 'మై డియర్ భూతం' చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

PREV
17
My Dear Bootham: ప్రభుదేవా 'మై డియర్ భూతం' మూవీ రివ్యూ

ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా గురించి తెలియని వారుండరు. నటుడిగా, కొరియోగ్రాఫర్ గా, దర్శకుడిగా ప్రభుదేవా రాణించారు. చాలా రోజుల తర్వాత ప్రభుదేవా ఓ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్ రాఘవన్ దర్శకత్వంలో తాజాగా ప్రభుదేవా నటించిన 'మై డియర్ భూతం' చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫాంటసీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఆడియన్స్ ని ఏమేరకు మెప్పించిందో సమీక్షలో చూద్దాం.  

 

27

కథ :

భూత లోకాన్ని ఏలే మహారాజుగా కర్ణముఖి (ప్రభుదేవా) ఉంటాడు. అతడికి చాలా ఏళ్ల తర్వాత కింకియా అనే కొడుకు జన్మిస్తాడు. దీనితో కర్ణముఖి చాలా సంతోషిస్తాడు. తన కొడుకుతో ఒకరోజు ఆడుకుంటుండగా.. పొరపాటున కింకియా వల్ల ఒక మహర్షికి తపో భంగం కలుగుతుంది. దీనితో మహర్షి ఆగ్రహంతో కర్ణముఖిని భూలోకంలో శిలగా మారిపొమ్మని శపిస్తాడు. తనకి శాప విమోచనం కలిగించాలని కర్ణముఖి మహర్షిని వేడుకుంటాడు. దీని నుంచి నిన్ను బయటకి తీసుకొచ్చిన వ్యక్తి ఓ మంత్రాన్ని చదివితే నువ్వు తిరిగి నీ లోకానికి చేరుకుంటావు అని చెబుతాడు. 

 

37

మరోవైపు నత్తితో బాధపడే చిన్న పిల్లడు శ్రీనివాస్ (అశ్వంత్) కథ జరుగుతూ ఉంటుంది. అతడి నత్తి కారణంగా శ్రీనివాస్ స్కూల్ లో అవమానానికి గురవుతూ ఉంటాడు. ఒకరోజు శ్రీనివాస్ కర్ణముఖి శిలని తాకుతాడు. దీనితో కర్ణముఖి తన రూపానికి వచ్చేస్తాడు. కానీ అతడు తన లోకానికి వెళ్లాలంటే శ్రీనివాస్ మంత్రాన్ని జపించాలి. నత్తితో బాధపడే చిన్న పిల్లాడు ఆ మంత్రాన్ని చదవగలిగాడా ? ఈ క్రమంలో కర్ణముఖి, శ్రీనివాస్ మధ్య ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.. కర్ణ ముఖి చివరకి తన లోకానికి చేరుకుంటాడా ? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 

 

47

విశ్లేషణ :

ఈ చిత్రానికి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే.. చిన్న పిల్లలని ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. దర్శకుడు ఏం రాఘవన్ చిన్న పిల్లలని టార్గెట్ చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక ఫస్ట్ హాఫ్ మొత్తం వినోదాత్మకంగా సాగుతుంది. తొలి గంటలోనే కథ ఏంటనేది స్పష్టం అవుతుంది. ఆ తర్వాత అదే గ్రాఫ్ మైంటైన్ చేస్తూ కొనసాగింపు ఆకట్టుకునే విధంగా ఉంటుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా అశ్వంత్ అద్భుతంగా నటించాడు. నత్తి ఉన్న పిల్లాడిలా అశ్వంత్ పరిణితితో కూడిన నటన కనబరిచాడు. చాలా  సన్నివేశాల్లో అశ్వంత్ నటన ప్రభుదేవాతో సమానంగా ఉండనే చెప్పాలి. ఇక ప్రభుదేవా తన పాత్రలో ఒదిగిపోయారు. ప్రభుదేవా హావ భావాలు, డాన్స్, సెంటిమెంట్ ఇలా ప్రతి అంశంలో తానేంటో మరోసారి చూపించారు. 

57

నవ్విస్తూనే.. ఎమోషనల్ గా కూడా ప్రభుదేవా మెప్పించారు. ముందుగా చెప్పుకున్నట్లుగా ఫస్ట్ హాఫ్ లో ఎంటర్టైనింగ్ మూమెంట్స్ చాలా ఉంటాయి. సెకండ్ హాఫ్ లో కూడా ఇదే టెంపో కొనసాగి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. కానీ సెకండ్ హాఫ్ లో కథ బాగా నెమ్మదించింది. సెకండ్ హాఫ్ లో చాలా సన్నివేశాలు రిపీట్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. దీనితో ఆడియన్స్ బోర్ ఫీల్ అవుతారు. సన్నివేశాలని రూపొందించిన విధానం కూడా పాత చిత్రాల్లో ఫాంటసీ ఎలిమెంట్స్ ని చూసినట్లు అనిపిస్తుంది. ఇక అశ్వంత్, అతడి తల్లిగా నటించిన రమ్య నంబీశన్ మధ్య సన్నివేశాలు సరిగా లేవు. ఫాంటసీ కథకి థ్రిల్లింగ్ క్లయిమాక్స్, అబ్బురపరిచే విజువల్ ఎఫెక్ట్స్ అవసరం. ఈ రెండింటి విషయంలో దర్శకుడు కాంప్రమైజ్ అయి సాదా సీదాగా చూట్టేసినట్లు అనిపిస్తుంది. 

 

67

టెక్నికల్ గా :

ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ బావుంటాయి. కెమెరా మెన్, ఎడిటర్ ల పనితీరు బావుంది. ఇక సంగీత దర్శకుడు ఇమాన్ కథకి అవసరమైన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించారు. దర్శకుడు రాఘవన్ ఎంచుకున్న ఫాంటసీ పాయింట్ మంచిదే. కానీ సెకండ్ హాఫ్ లో ఓల్డ్ ట్రీట్మెంట్ తో నిరాశపరిచారు. 

ఇక విజువల్ ఎఫెక్ట్స్ పై ఏమాత్రం ఫోకస్ పెట్టకపోవడం పెద్ద మైనస్. కొన్ని సన్నివేశాల్లో విజువల్ ఎఫెక్ట్స్ పెద్దలకు ఏ మాత్రం ఎక్కవు. సిల్లీగా అనిపిస్తాయి. చిన్న పిల్లల కోసం సన్నివేశాలు రాసుకోవడం మంచిదే.. కానీ కాస్త కొత్తగా ఆలోచించి ఉండాల్సింది. 

77

ఫైనల్ థాట్ : మైడియర్ భూతం చిత్రం ఫస్ట్ హాఫ్ ఎంటర్టైనింగ్ గా ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ జస్ట్ ఓకె అనిపిస్తుంది. ఫాంటసీ చిత్రాలని చిత్రాలని ఇష్టపడేవారు తక్కువ అంచనాలతో ఈ చిత్రాన్ని చూడొచ్చు. 

రేటింగ్ : 2.5/5

click me!

Recommended Stories