Prabhas: దేవుడా మళ్లీ పోయిందా, ప్రభాస్‌ ఎమోషనల్‌.. కట్‌ చేస్తే చిరు, బాలయ్యకి చుక్కలు చూపించిన సినిమా

Published : Mar 25, 2026, 12:11 PM IST

ప్రభాస్‌ హీరోగా పరిచయం అయిన రెండు సినిమాలు పరాజయం చెందాయి. దీంతో మూడో సినిమా కూడా పోయిందనుకున్నారట. కానీ కట్‌ చేస్తే చిరంజీవి, బాలయ్య సినిమాలకు చుక్కలు చూపించింది.

PREV
15
ప్రభాస్‌ పేరుతో వేలకోట్ల వ్యాపారం

ప్రభాస్‌ ఇప్పుడు గ్లోబల్‌ స్టార్‌. పాన్‌ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాదు, ఇండియన్‌ సినిమాలోనే అత్యంత భారీ సినిమాల లైనప్‌ ఉన్న హీరో ప్రభాస్‌ కావడం విశేషం. ఆయన పేరుతో ఇప్పుడు ఐదారు వేల కోట్ల వ్యాపారం జరుగుతుందంటే అతిశయోక్తి కాదు. అంతటి బిగ్గెస్ట్ స్టార్‌ గా రాణిస్తోన్న ప్రభాస్ కి మొదట సినిమాలంటే ఇష్టం లేదు. అసలు ఇటువైపు రావాలని కూడా అనుకోలేదు. కానీ ఫ్యామిలీలో ఫోర్స్, ఫ్రెండ్స్ కామెంట్స్ ఆయన్ని సినిమాల వైపు నడిపించాయి. ఓ సారి ట్రై చేద్దామని వచ్చి ఇప్పుడు ఇండస్ట్రీని రూల్‌ చేస్తున్నారు ప్రభాస్.

25
ఈశ్వర్‌ తో హీరోగా పరిచయం అయిన ప్రభాస్‌

ప్రభాస్‌ కెరీర్‌లో చెప్పుకోదగ్గ హిట్స్ తక్కువే. హిట్స్ కంటే పరాజయాలే ఎక్కువగా ఉన్నాయి. ఆయన `ఈశ్వర్‌` మూవీతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత `వర్షం` చిత్రంతో తొలి బ్రేక్‌ అందుకున్నారు. `ఛత్రపతి` మూవీతో స్టార్‌ హీరో అయిపోయారు. `డార్లింగ్‌`, `మిస్టర్‌ పర్‌ఫెక్ట్` చిత్రాలతో లవర్‌ బాయ్‌గా మారిపోయారు, `బుజ్జిగాడు`, `యోగి`, `రెబల్‌`, `బిల్లా` చిత్రాలతో మాస్‌ హీరోగా ఎదిగారు. `మిర్చి`తో మరో సూపర్‌ హిట్‌ అందుకున్నారు. `బాహుబలి` చిత్రాలతో పాన్‌ ఇండియా హీరో అయిపోయారు. ఆ తర్వాత `సలార్‌`, `కల్కి 2898ఏడీ` సినిమాలతో మెప్పించారు.

35
ప్రభాస్‌ ఫస్ట్ రెండు సినిమాలు పరాజయం

ఇదిలా ఉంటే కెరీర్‌ బిగినింగ్‌లో సినిమాల ఫలితాలు తనని బాగా ప్రభావితం చేశాయట. చాలా టెన్షన్‌ పడేవారట. ప్రభాస్‌ ఈ విషయాలను పంచుకున్నారు. `ఈశ్వర్‌` సినిమాలో తనని తాను చూసుకొని ఆశ్చర్యమేసిందట. తాను ఇలా ఉంటానా? అనుకున్నారట. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఓవరాల్‌గా ఫ్లాప్‌ మూవీగా నిలిచింది. ఆ తర్వాత `రాఘవేంద్ర` మూవీ చేశారు ప్రభాస్‌. ఈ సినిమా పరిస్థితి కూడా సేమ్‌.

45
వర్షం సినిమాకి మొదట ఫ్లాప్‌ టాక్‌

ఆ తర్వాత `వర్షం` సినిమా చేశారు ప్రభాస్‌. ఈ కథ చెప్పినప్పుడు ఆయన చాలా ఎగ్జైట్‌ అయ్యారట. `హీరో ఒక కొండ మీద డ్రిల్లింగ్‌ మిషన్‌తో పనిచేస్తుంటాడు` అని దర్శకుడు తొలిసీన్‌ చెప్పినప్పుడు తెగ ఊహించుకున్నారట ప్రభాస్‌. హాలీవుడ్‌ రేంజ్‌ హీరోలా అనుకున్నారట. కానీ ఆ సీన్‌చేసేటప్పుడు అది ఎంత కష్టమో అర్థమయ్యింది. ఏదీ ఊహించుకున్నట్టుగా థ్రిల్లింగ్‌గా ఉండదని అప్పుడు అర్థమయ్యింది. అయితే ఈ మూవీ షూటింగ్‌ అయిపోయింది. సినిమా రిలీజ్‌ అయ్యింది. ఫస్ట్ డే టాక్‌ యావరేజ్‌. ఫర్వాలేదంటున్నారట. దీంతో దేవుడా మళ్లీ ఫ్లాపా అని ఆందోళన చెందారట ప్రభాస్‌. ఓ రకంగా ఆయన ఎమోషనల్‌ అయిపోయారట. నాలుగైదు రోజులకు కలెక్షన్లు బాగానే ఉన్నాయని చెప్పారట. ఆ తర్వాత కట్‌ చేస్తే అది బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయ్యింది. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అంతేకాదు చిరంజీవి, బాలయ్యలకు చుక్కలు చూపించింది.

55
చిరంజీవి, బాలయ్యకి చుక్కలు చూపించిన వర్షం

`వర్షం` సినిమా 2004లో సంక్రాంతికి విడుదలయ్యింది. ప్రారంభంలో మిశ్రమ స్పందనతో రాబట్టుకుంది. కానీ ఆ తర్వాత పుంజుకొని బ్లాక్‌ బస్టర్‌ అయ్యింది. అదే సంక్రాంతికి చిరంజీవి నటించిన `అంజి` సినిమా విడుదలైంది. ఇది ఓపెనింగ్ రాబట్టుకున్నా, ఆ తర్వాత డల్‌ అయ్యింది. చివరికి డిజాస్టర్‌ గా నిలిచింది. అదే సంక్రాంతికి సరిగ్గా `వర్షం` రిలీజ్‌ అయిన రోజే బాలయ్య నటించిన `లక్ష్మీ నరసింహ` మూవీ రిలీజ్‌ అయ్యింది. ఈ చిత్రం కూడా యావరేజ్‌గా ఆడింది. `వర్షం` సునామీ ముందు డల్‌ అయ్యాయి. చిరు, బాలయ్య సినిమాలు నిరాశ పరిచాయి.  వర్షం ఆ ఏడాది ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories