ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. అల్లు స్నేహారెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్నారా? తెరవెనుక జరిగిన కథ వేరే ఉందా? పెళ్లికి ముందే ఈ ఇద్దరికి పరిచయం ఉందా? ఎవరికీ తెలియని విషయాలను బన్నీ బయటపెట్టాడు.
ఇటీవలే 15వ మ్యారేజ్ యానివర్సరీ పూర్తి చేసుకున్న అల్లు అర్జున్, స్నేహారెడ్డి
అల్లు అర్జున్ ఇప్పుడు ఐకాన్‌స్టార్‌గా రాణిస్తున్నారు. `పుష్ప 2`తో ఆయన ఇమేజ్ పాన్ ఇండియా దాటిపోయింది. ఇప్పుడు గ్లోబల్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నారు. అట్లీ దర్శకత్వంలో ఆయన `ఏఏ 22` చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ ఇటీవల తన 15వ మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నారు. స్నేహారెడ్డిని ఆయన 2011 మార్చి 6న వివాహం చేసుకున్నారు. వీరిద్దరు మాత్రం ఎంతో ప్రేమగా ఉంటారు. ఆదర్శ జంటగా రాణిస్తున్నారు. అయితే వీరిది ప్రేమ పెళ్లి అనే వార్తలు కూడా వచ్చాయి.
25
అల్లు అర్జున్ స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడా?
అల్లు అర్జున్, స్నేహారెడ్డి ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారనే వార్తలు అడపాదడపా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు అంత క్లోజ్‌గా ఉంటారు. దీంతో బన్నీది లవ్ మ్యారేజ్ అనే కామెంట్స్ వచ్చాయి. ఈ విషయం ఆయన వరకు వెళ్లింది. దీంతో బన్నీ దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఈ వార్తలు రావడానికి కారణమేంటో తెలిపారు. తమది నిజంగానే లవ్ మ్యారేజా? అరెంజ్ మ్యారేజా అనే విషయాన్ని అల్లు అర్జున్ చెప్పాడు. ఈ క్రమంలో ఎవరికీ తెలియని విషయాలను ఆయన బయటపెట్టాడు.
35
స్నేహారెడ్డి ముందే పరిచయం, కానీ
`మాది ప్రేమ పెళ్లి అనుకుంటారు. కానీ పెద్దలు కుదిర్చిన పెళ్లినే` అని స్పష్టం చేశారు అల్లు అర్జున్. స్నేహ తనకు మంచి స్నేహితురాలు అని, తమ ఇద్దరి అభిరుచులు కలిశాయని, `మీరిద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది` అని తన ఫ్రెండ్స్ చెప్పారని, ఆ తర్వాత తాను కూడా ఆ దిశగా ఆలోచించినట్టు చెప్పాడు అల్లు అర్జున్. ఆ తర్వాత మూడు నెలలు గడిచాక ఇంట్లో వాళ్లు ఏకంగా పెళ్లి సంబంధమే చూశారట. ఈ సంబంధాన్ని ఫిక్స్ చేసినట్టు తెలిపాడు బన్నీ.
ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని చేసుకోవద్దు అనుకున్న బన్నీ
ఈ సందర్భంగా మరో ఆసక్తికర విషయాన్ని చెప్పాడు అల్లు అర్జున్. ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదని ముందే అనుకున్నాడట. అయితే దానికి ప్రత్యేక కారణం ఏం లేదన్నాడు. మన ఆలోచన దృక్పథం ఇంకాస్త విస్తృతమవ్వడానికి మరో రంగానికి చెందిన వాళ్లతో కలిసి ఉంటే మంచిదని, స్నేహకు సినిమాల గురించి పెద్దగా తెలియదని, తమ ఇద్దరి మైండ్ సెట్ వేరు అని, భిన్న ధృవాలు పరస్పరం ఆకర్షించుకుంటాయని అంటారు. అలా తమ బంధం మరింత బలపడిపోయిందని చెప్పాడు బన్నీ. కొన్నేళ్ల క్రితం ఈనాడుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ ఈ విషయాలను పంచుకున్నారు.
అల్లు అర్జున్, స్నేహా రెడ్డి 2011లో పెళ్లి చేసుకోగా, వీరికి కొడుకు అయాన్, కూతురు అర్హ జన్మించారు. అల్లు స్నేహారెడ్డి పొలిటికల్ ఫ్యామిలీ. నాన్న కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి వ్యాపారవేత్త. రాజకీయనాయకుడు. విద్యాసంస్థలు కూడా ఉన్నాయి. అల్లు స్నేహారెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇప్పుడున్నస్టార్స్ హీరోల భార్యల్లో అత్యంత యాక్టివ్‌గా ఉన్నది స్నేహారెడ్డినే. ఆమె సోషల్ మీడియాలో రెగ్యూలర్ గా పోస్ట్ లు పెడుతుంది. ఫిట్‌నెస్ వీడియోలు, షాపింగ్ వీడియోలు, తమ పిల్లల వీడియోలు పంచుకుంటుంది. కొత్త కొత్తవి ఎక్స్ ఫ్లోర్ చేస్తుంటుంది.